PMK Ramdas: చెమటోడ్చి పెంచిన పార్టీని ముక్కలు చేయడం భావ్యమా..
ABN, Publish Date - Aug 08 , 2025 | 09:50 AM
పాట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) అనే వటవృక్షాన్ని తన చెమటతో పెంచి పోషించానని, ప్రస్తుతం తన తనయుడే ఆ వృక్షాన్ని గొడ్డలతో నరికి ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
- తనయుడిపై రాందాస్ ఆగ్రహం
చెన్నై: పాట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) అనే వటవృక్షాన్ని తన చెమటతో పెంచి పోషించానని, ప్రస్తుతం తన తనయుడే ఆ వృక్షాన్ని గొడ్డలతో నరికి ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్(Dr. Ramdas) ఆవేదన వ్యక్తం చేశారు. దిండివనం తైలాపురం గార్డెన్‌లో గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్బుమణి తన నివాసానికి వచ్చినప్పుడల్లా తల్లిని మాత్రమే పరామర్శించి వెళ్తున్నాడన్నారు.
పార్టీలోని 34 విభాగాలకు చెందిన ప్రతినిధులను డబ్బుతో తన వెంట తిప్పుకుంటున్న అన్బుమణి వల్లే పార్టీలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించారు. ఈ కారణంగానే యేళ్ల తరబడి తనను ‘అయ్యా...!’ అని వినమ్రంగా సంబోధించినవారంతా ప్రస్తుతం అందరూ తనను ‘రాందాస్’ అని పేరుపెట్టి పిలిచే స్థాయికి తెచ్చిన ఘనత అన్బుమణికే దక్కిందన్నారు. కుట్రలు కుతంత్రాలు పన్నుతూ పార్టీని హస్తగతం చేసుకోవాలని అన్బుమణి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారని,
మే నెలలోనే పార్టీ అధ్యక్ష పదవి ఖాళీ అయిన విషయం కూడా ఆయనకు తెలియదని రాందాస్ అన్నారు. చెమటోడ్చి పెంచిన పీఎంకే అనే వృక్షంలోని ఓ కొమ్మ నరికి, ఆ కొమ్మకు గొడ్డలి బిగించుకుని వృక్షాన్ని సమూలంగా ముక్కలు చేసేందుకు అన్బుమణి ప్రయత్నిస్తున్నాడంటూ రాందాస్ ఆరోపించారు. తైలాపురం గార్డెన్ పీఎంకే ప్రధాన కార్యాలయమని,
ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశానని, ప్రస్తుతం తాను చేస్తున్న న్యాయపోరాటంలో గెలిచి పార్టీపై పూర్తి ఆధిపత్యం సంపాదిస్తానని రాందాస్ ధీమా వ్యక్తం చేశారు. అన్బుమణి మాయమాటలకు మోసపోయి ఆయన వెంట తిరుగుతున్నవారంతా తన దగ్గరకు తిరిగిరావాలని, వారిని తల్లిలా తాను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నానని రాందాస్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆల్‌టైం గరిష్ఠానికి పసిడి ధరలు.. ఎంతకు చేరుకున్నాయంటే..
ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు అరుదైన గుర్తింపు
Read Latest Telangana News and National News
Updated Date - Aug 08 , 2025 | 09:50 AM