Chennai: ఎమ్మెల్యేకు షాకిచ్చిన పీఎంకే చీఫ్ రాందాస్
ABN, Publish Date - Jun 24 , 2025 | 12:30 PM
పీఎంకేలో జరుగుతున్న ఆధిపత్యపోరుతో ఆ పార్టీ సీనియర్ నేతల పదవులు పోతున్నాయి. పార్టీ అధ్యక్షుడు డాక్టర్ అన్బుమణికి బలమైన మద్దతుదారుడిగా ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యే సదాశివంను పార్టీ పదవి నుంచి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాందాస్ తొలగించారు.
చెన్నై: పీఎంకేలో జరుగుతున్న ఆధిపత్యపోరుతో ఆ పార్టీ సీనియర్ నేతల పదవులు పోతున్నాయి. పార్టీ అధ్యక్షుడు డాక్టర్ అన్బుమణికి బలమైన మద్దతుదారుడిగా ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యే సదాశివం(MLA Sadashivam)ను పార్టీ పదవి నుంచి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాందాస్(Dr Ramdas) తొలగించారు. ఈ మేరకు రాందాస్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
సదాశివం సేలం పార్టీ పశ్చిమ జిల్లా విభాగం కార్యదర్శిగా, మేట్టూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. తన కుమారుడు అన్బుమణి పక్షాన నిలబడినందుకు సదాశివంను పార్టీ పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో వీఈ రాజేంద్రన్‌ను కార్యదర్శిగా నియమించారు.
ఈయనకు మేట్టూరు, ఓమలూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్ బాధ్యతలను రాందాస్(Ramdas) అప్పగించారు. అన్బుమణికి మద్దతుగా ఉన్న నేతల పార్టీ పదవులను తొలగించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి.
గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలి
Read Latest Telangana News and National News
Updated Date - Jun 24 , 2025 | 12:30 PM