ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: మాజీ సీఎం విజయ్‌ రూపానీతో మోదీ జ్ఞాపకాలు, కుటుంబానికి పరామర్శ

ABN, Publish Date - Jun 13 , 2025 | 04:38 PM

ప్రధాని మోదీ గుజరాత్ మాజీ సీఎం విజయ్‌ రూపానీ కుటుంబాన్ని పరామర్శించారు. విమాన ప్రమాదంలో చనిపోయిన వాళ్లలో రూపానీ కూడా ఉన్నారు. తీవ్ర ఆవేదన వెలిబుచ్చిన మోదీ.. రూపానీతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

PM Modi - Vijay Rupani

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ మాజీ సీఎం విజయ్‌భాయ్ రూపానీ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. నిన్న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో అసువులు బాసిన వాళ్లలో విజయ్ రూపానీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ప్రమాదం నేపథ్యంలో ఇవాళ గుజరాత్ వెళ్లిన ప్రధాని మోదీ ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల యోగక్షేమాలు అడిగారు. అనంతరం విజయ్ రూపానీ ఇంటికివెళ్లి కుటుంబసభ్యులతో తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సందర్భంగా పీఎం మోదీ.. విజయ్‌భాయ్ మన మధ్య లేరనేది ఊహించలేనిదన్నారు. తనకు దశాబ్దాలుగా ఆయన తెలుసన్న మోదీ.. భుజం భుజం కలిపి.. తామిద్దరం కలిసి పనిచేశామని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అత్యంత సవాలుతో కూడిన సమయాల్లో కూడా విజయ్‌భాయ్ వినయపూర్వకంగా కష్టపడి పనిచేసేవారని మోదీ అన్నారు. పార్టీ సిద్ధాంతానికి దృఢంగా కట్టుబడి ఉండేవారని, ఉన్నత స్థాయికి ఎదిగి, వివిధ బాధ్యతలను నిర్వహించి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంతోశ్రద్ధాశక్తులతో సేవలందించారని మోదీ కీర్తించారు.

రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అయినా, రాజ్యసభ ఎంపీగా అయినా, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా అయినా, క్యాబినెట్ మంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా అయినా, ఆయనకు కేటాయించిన ప్రతి బాధ్యతలోనూ ఆయన ఎల్లప్పుడూ ఒక ప్రత్యేకమైన ప్రతిభను కనబరిచారని మోదీ చెప్పారు.

విజయ్‌భాయ్ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం తనకు లభించిందని, గుజరాత్ అభివృద్ధి ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆయన అనేక చర్యలు తీసుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. వాటిలో 'ఈజ్ ఆఫ్ లివింగ్' ముఖ్యమైనదని చెప్పారు. ఆయనతో జరిగిన సమావేశాలు, చర్చలు ఎల్లప్పుడూ గుర్తుండి పోతాయని మోదీ బాధాతప్త హృదయంతో అన్నారు. ఓం శాంతి.. అంటూ మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఇవీ చదవండి:

ఢిల్లీ పెత్తనాన్ని అనుమతించం

కులదైవం అంటూనే గునపాలతో..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 13 , 2025 | 05:19 PM