Sudarshan Chakra: దేశానికి భద్రతా కవచం.. 2035 నాటికి రంగంలోకి సుదర్శన చక్ర..
ABN, Publish Date - Aug 16 , 2025 | 11:03 AM
శ్రీకృష్ణుడి స్ఫూర్తితో దేశానికి సదర్శన చక్ర భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. 2035 నాటికల్లా ఈ భద్రతా కవచం పనిచేయడం ప్రారంభిస్తుందని, దేశాన్ని శత్రుదుర్భేధ్యంగా మారుస్తామని ప్రకటించారు.
శ్రీకృష్ణుడి స్ఫూర్తితో దేశానికి సదర్శన చక్ర (Sudarshan Chakra) భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. 2035 నాటికల్లా ఈ భద్రతా కవచం పనిచేయడం ప్రారంభిస్తుందని, దేశాన్ని శత్రుదుర్భేధ్యంగా మారుస్తామని ప్రకటించారు. ఈ సుదర్శన చక్రం అనేది దీర్ఘ-శ్రేణి రాడార్లు, ఉపగ్రహాల నుంచి నిఘా ఇన్‌పుట్‌లు, విమానాలు, యూఏవీలు, దీర్ఘ-శ్రేణి ఇంటర్‌సెప్టర్ క్షిపణుల సంక్లిష్ట కలయిక. మన దేశం వైపు ప్రత్యర్థుల నుంచి వచ్చే వైమానిక ముప్పు దేన్నైనా తటస్థీకరించగలదు (Mission Sudarshan Chakra).
ఈ సుదర్శన చక్రం భారతదేశ గగనతలాన్ని శత్రు క్షిపణులు, డ్రోన్‌లు, రాకెట్ల నుంచి రక్షిస్తుంది. అదే సమయంలో ఆ దాడికి ప్రతీకారం కూడా తీర్చుకుంటుంది. శత్రువుపైకి మిసైళ్లను సంధిస్తుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు, సాయుధ డ్రోన్‌లను సుదర్శన చక్రం భారీగా ధ్వంసం చేసింది. ఇలాంటి భద్రతా కవచాలను దేశంలోని ప్రధాన ప్రాంతాలన్నింటిలో ఏర్పాటు చేయబోతున్నారు. కొన్ని నెలల క్రితం ఇరాన్ ప్రయోగించిన 500 బాలిస్టిక్ క్షిపణులలో 498ని ఇజ్రాయెల్ ఈ తరహా వ్యవస్థ ద్వారానే న్యూట్రలైజ్ చేయగలిగింది.
భారతదేశం ఇప్పటికే అధునాతన రాడార్ సామర్థ్యాన్ని నిర్మించుకుంది. అయితే వివిధ శ్రేణులు, విభిన్న ఎత్తుల నుంచి వచ్చే క్షిపణులను ఎదుర్కోవడానికి బహుళ శ్రేణి ఇంటర్‌సెప్టర్‌లను అభివృద్ధి చేసుకోవాలి. మిషన్ సుదర్శన్ చక్ర కేవలం రక్షణకు మాత్రమే పరిమితం కాకుండా తిరిగి దాడి చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. అయితే శత్రు దేశ టార్గెట్‌లను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించే స్వల్ప, మధ్యస్థ, దీర్ఘ శ్రేణి బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను అభివృద్ధి చేస్తోంది. సముద్రం, భూమి నుంచి శత్రు నౌకలను లక్ష్యంగా చేసుకోవడానికి భారత నావికాదళానికి దీర్ఘ శ్రేణి క్షిపణులు కూడా అవసరం.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింతగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News
Updated Date - Aug 16 , 2025 | 11:03 AM