PM Modi: మోదీ రష్యా పర్యటన రద్దు
ABN, Publish Date - Apr 30 , 2025 | 04:04 PM
రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై సోవియట్ రష్యా విజయానికి చిహ్నంగా 80వ 'విక్టరీ డే 'ను రష్యా జరుపుకోనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2024 జూలైలో రష్యాలో పర్యటించారు.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) రష్యా (Russia) పర్యటన రద్దయింది. షెడ్యూల్ ప్రకారం మే 9న రష్యాలో జరిగే "విక్టరీ డే'' సెలబ్రేషన్స్‌లో మోదీ పాల్గొనాల్సి ఉంది. అయితే ఆయన పర్యటన రద్దయినట్టు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. పహల్గాంలో 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు కాల్చిచంపడంతో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
Pakistan: ఇస్లామాబాద్, లాహోర్‌లో నో-ఫ్లై జోన్ ప్రకటించిన పాక్
రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై సోవియట్ రష్యా విజయానికి చిహ్నంగా 80వ 'విక్టరీ డే 'ను రష్యా జరుపుకోనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2024 జూలైలో రష్యాలో పర్యటించారు. దానికి ముందు 2019లో వ్లాడివోస్టోక్ సిటీలో జరిగిన ఎకనామిక్ కాంక్లేవ్‌లో పాల్గొన్నారు.
కాగా, ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి గట్టి జవాబు ఇచ్చి తీరుతామని భారత్ విస్పష్టంగా ప్రకటించింది. ఈ దుశ్చర్యకు పాక్ ఉగ్రమూకలే బాధ్యులని భారత్ గట్టి ఆధారాలు చూపుతోంది. 2019లో పుల్వామా దాడి అనంతరం జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి కావడంతో పహల్గాం ఉగ్రమూకలను ఎక్కడున్నా వేడాడతామని భారత్ ప్రతినిబూనింది. ఈ దాడికి తామే కారణమంటూ లష్కరే తొయిబా అనుబంధ సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ప్రకటించడంతో భారత్ భగ్గుమంటోంది. పహల్గాం ఉగ్రదాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు భారత సైన్యానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్టు ప్రకటించింది. తేదీ, సమయం, టార్గెట్‌ను నిర్ణయించుకునే స్వేచ్ఛ సాయుధ బలగాలకు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
Classroom Scam: రూ.2,000 కోట్ల కుంభకోణం.. ఆప్ నేతలపై ఏసీబీ కేసు
Pahalgam Terror Attack: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..
India Vs Pak: కవ్విస్తున్న పాక్.. యుద్ధం తప్పదా..
Updated Date - Apr 30 , 2025 | 04:05 PM