PM Modi Meets Shubhanshu Shukla: ప్రధాని మోదీతో శుభాంశు శుక్లా భేటీ
ABN, Publish Date - Aug 18 , 2025 | 08:24 PM
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శుభాంశు తన బృందంతో జూన్ 25 నుంచి జూలై 15 వరకూ ఐఎస్ఎస్ యాత్ర జరిపారు. ఐఎస్ఎస్‌కు పర్యటించిన తొలి భారతీయ వ్యోమగామిగా ఆయన గుర్తింపు పొందారు.
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని స్వదేశానికి చేరుకున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో సోమవారంనాడు కలుసుకున్నారు. ఐస్రో అస్ట్రోనాట్ జాకెట్ ధరించి వచ్చిన శుభాంశును మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రోదసి ప్రయాణ విశేషాలను ప్రధానితో ఆయన పంచుకున్నారు. యాత్ర విజయవంతం కావడంపై ప్రధాని శుభాంశును అభినందించారు.
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శుభాంశు తన బృందంతో జూన్ 25 నుంచి జూలై 15 వరకూ ఐఎస్ఎస్ యాత్ర జరిపారు. ఐఎస్ఎస్‌కు పర్యటించిన తొలి భారతీయ వ్యోమగామిగా ఆయన గుర్తింపు పొందారు. 18 రోజుల మిషన్ పూర్తి చేసుకుని జూలై 15న ఆయన తిరిగి భూమిపై కాలుపెట్టారు. ఆదివారంనాడు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఆయనకు ఘన స్వాగతం లభించింది. శుభాంశు కుటుంబ సభ్యులతో పాటు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఇస్రో చైర్మన్ వి.నారాయణ, పెద్ద సంఖ్యలో ప్రజలు సాదర స్వాగతం పలికారు.
కాగా, శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర విజయవంతం కావడంలో లోక్‌సభలో సోమవారంనాడు ప్రత్యేక చర్చ జరిపారు. శుక్లా పర్యటన విజయవంతం కావడాన్ని స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. ఇది భారతదేశంలోని ప్రతి పౌరునికి, ముఖ్యంగా యువకులకు స్ఫూరిదాయకమన్నారు.
ఇవి కూడా చదవండి..
మోదీని కలిసిన ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 18 , 2025 | 08:27 PM