Share News

Putin Dials PM Modi: మోదీకి పుతిన్ ఫోన్.. అసలు కారణం ఇదే..

ABN , Publish Date - Aug 18 , 2025 | 06:25 PM

మోదీకి పుతిన్ ఫోన్ చేసిన విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 2022 ఫిబ్రవరి నుంచి రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై భారత వైఖరిని ప్రధాని పునరుద్ఘాటించారని, శాంతియుత తీర్మానం చేసుకోవాలని ప్రధాని సూచించారని, దీనికి సంబంధించి తాము కూడా అన్నివిధాలుగా మద్దతిస్తామని చెప్పారని తెలిపింది.

Putin Dials PM Modi: మోదీకి పుతిన్ ఫోన్.. అసలు కారణం ఇదే..
Putin with PM Modi

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladmir Putin) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి సోమవారం నాడు ఫోన్ చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించే విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పుతిన్ గత శుక్రవారం నాడు అలస్కాలో సమావేశమైన అనంతరం మోదీకి ఫోన్ చేయడం ఇదే మొదటిసారి.


మోదీకి పుతిన్ ఫోన్ చేసిన విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 2022 ఫిబ్రవరి నుంచి రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై భారత వైఖరిని ప్రధాని పునరుద్ఘాటించారని, శాంతియుత తీర్మానం చేసుకోవాలని సూచించారని తెలిపింది. దీనికి సంబంధించి తాము కూడా అన్నివిధాలుగా మద్దతిస్తామని ప్రధాని చెప్పారని పేర్కొంది. ద్వైపాక్షిక సంబంధాలపైనా ప్రధాని మోదీ, పుతిన్‌ మాట్లాడారని, ఎప్పటికప్పుడు ఒకరితో మరొకరు సంప్రదింపులు సాగించాలని కూడా అనుకున్నారని పీఎంఓ తెలిపింది.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం సామాజిక మాధ్యమంలో ఈ విషయాన్ని తెలియజేశారు. 'మిత్రుడు ఫోన్ చేసి అలస్కాలో ట్రంప్‌తో జరిగిన సమావేశం వివరాలను పంచుకున్నందుకు థాంక్స్. ఉక్రెయిన్ ఉద్రిక్తతలకు శాంతియుత పరిష్కారం చేసుకోవాలని ఇండియా ఎప్పటికప్పుడు చెబుతోంది. ఇందుకు అన్నివిధాలా మా సహకారం ఉంటుంది' అని మోదీ ట్వీట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

కాకాణి గోవర్ధన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్

కేంద్రమంత్రులతో నారా లోకేష్ భేటీ.. ఎందుకంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 18 , 2025 | 08:16 PM