Share News

Nara Lokesh Meets Nitin Gadkari: కేంద్రమంత్రులతో నారా లోకేష్ భేటీ.. ఎందుకంటే..

ABN , Publish Date - Aug 18 , 2025 | 03:12 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ ఢిల్లీలో సోమవారం పర్యటిస్తున్నారు. ఏపీ అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి పనులపై పలువురు కేంద్రమంత్రులను లోకేష్ కలుస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఉపరితల రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో నారా లోకేష్ భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు – మచిలీపట్నం నడుమ ఆరులైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి లోకేష్ విజ్జప్తి చేశారు.

Nara Lokesh Meets Nitin Gadkari:  కేంద్రమంత్రులతో నారా లోకేష్ భేటీ.. ఎందుకంటే..
Nara Lokesh Meets Nitin Gadkari

న్యూఢిల్లీ, ఆగస్టు18(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ (AP Minister Nara Lokesh) ఢిల్లీలో ఇవాళ(సోమవారం) పర్యటిస్తున్నారు. ఏపీ అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి పనులపై పలువురు కేంద్రమంత్రులను లోకేష్ కలుస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఉపరితల రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో (Nitin Gadkari) నారా లోకేష్ భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు – మచిలీపట్నం నడుమ ఆరులైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి లోకేష్ విజ్జప్తి చేశారు.


ఈ భేటీకి సబంధించిన వివరాలను మీడియాకు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన కానూరు – మచిలీపట్నం రోడ్డు విస్తరణ ద్వారా విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంతోపాటు రాజధాని ప్రాంత అభివృద్ధికి కూడా ఉపకరిస్తుందని తెలిపారు. హైదరాబాద్ – అమరావతి మధ్య కనెక్టివిటీలో ఎన్ హెచ్ – 65 కీలక పాత్ర పోషిస్తుందని ఉద్ఘాటించారు. ఇప్పటికే మంజూరైన హైదరాబాద్ – గొల్లపూడి రహదారి విస్తరణ ప్రాజెక్టును అమరావతితో అనుసంధానించేలా అదనపు పోర్టు లింకేజిని డీపీఆర్‌లో చేర్చాలని సూచించారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తూర్పు బైపాస్ రోడ్డు నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు.


ఎన్‌హెచ్ – 16 వెంట విశాఖపట్నంలో 20 కిలోమీటర్లు, విజయవాడలో 14.7 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ ప్లస్ మెట్రో కారిడార్లను నాగపూర్ మోడల్‌లో అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైందని వివరించారు. ఇందుకు సంబంధించి ఎన్ హెచ్ఎఐ, ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఉమ్మడి భాగస్వామ్యంతో డీపీఆర్ రూపకల్పన, వ్యయాన్ని భరించే అంశంపై చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు. ఏపీలో రీజనల్ కనెక్టివిటీ, డెవలప్‌మెంట్ కారిడార్ల అభివృద్ధిలో భాగంగా కర్నూలు – ఎమ్మిగనూరు రహదారి విస్తరణ, బైపాస్ రోడ్డు నిర్మాణం, వినుకొండ-గుంటూరు నడుమ ఎన్‌హెచ్ 544డీ, కాకినాడ పోర్టు – ఎన్‌హెచ్ 216 నడుమ దక్షిణ రహదారి, కాణిపాక వినాయక దేవాలయం లింకు రోడ్డు నిర్మాణ పనుల చేపట్టాల్సిందిగా కోరారు.


బెంగుళూరు – చెన్నయ్ (ఎన్ఇ-7) రహదారికి డైరక్ట్ కనెక్టివిటీ కోసం కుప్పం-హోసూరు – బెంగుళూరు నడుమ 56 కిలోమీటర్ల మేర రూ.3వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి వేగంగా అనుమతులు మంజూరు చేయాలని లోకేష్ కేంద్రమంత్రికి విన్నవించారు. కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కాడా) ప్రాంతంలో పారిశ్రామిక పార్కు అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు భద్రతా ప్రమాణాల మెరుగుదల, ట్రాఫిక్ రద్దీ నిర్వహణ, లాజిస్టిక్స్, పాసింజర్ కారిడార్ల ఇంటిగ్రేషన్ ఆవశ్యకతను వివరించారు. కేంద్రప్రభుత్వ సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతమైన భూసేకరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. స్థిరమైన మోడరన్ కనెక్టివిటీ కోసం గ్రీన్ కారిడార్లు, అధునాతన టోలింగ్, రియల్ టైమ్ ట్రాఫిక్ సమాచార వ్యవస్థల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం వహించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్జప్తి చేశారు.


నిర్మలా సీతారామన్‌‌ను కలిసిన నారా లోకేష్...

అలాగే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని నారా లోకేష్ కలిశారు. నిర్మలా సీతారామన్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు లోకేష్. ఆర్థిక కష్టాల నుంచి ఏపీ గట్టెక్కేందుకు సహకరిస్తున్నందుకు నిర్మలా సీతారామన్‌‌కి లోకేష్ కృతజ్ఞతలు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా లోకేశ్ ఢిల్లీ పర్యటన..

వైఎస్ జగన్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫోన్‌..

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 18 , 2025 | 04:18 PM