YS Jagan: వైఎస్ జగన్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్..
ABN , Publish Date - Aug 18 , 2025 | 01:59 PM
మాజీ సీఎం జగన్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని జగన్‌ను రాజ్‌నాథ్ కోరారు.
అమరావతి: దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఎన్టీఏ ప్రభుత్వం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధకృష్ణన్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని జగన్‌ను రాజ్‌నాథ్ కోరారు. అయితే గతంలో కూడా ప్రధాని ఎన్నికపై జగన్‌కు కేంద్రం నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు తన మద్దతు ప్రధాని మోదీకి తెలుపుతున్నట్లు జగన్ ప్రకటించారు.
అయితే తాజా పరిణామల దృష్ట్యా.. జగన్ సపోర్ట్ బీజేపీకి ఉంటుందా..? లేదా అనేది స్పష్టత లేదు. తాజాగా ప్రధాని మోదీపై తన మాటలతో జగన్ విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ప్రభుత్వాలు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తూ.. అధికారంలోకి వస్తున్నాయని పరోక్షంగా మోదీపై విమర్శలు చేశారు జగన్. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి జగన్ సపోర్ట్ చేస్తారా.. లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి
LICలో డిగ్రీ, బీటెక్ అభ్యర్థులకు ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షపైగా జీతం
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా లోకేశ్ ఢిల్లీ పర్యటన..