Kakani Govardhan Reddy: కాకాణి గోవర్ధన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:29 PM
మైకా అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. కాకాణికి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు.
అమరావతి: మైకా అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy)కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court) బెయిల్ మంజూరు చేసింది. కాకాణికి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్‌లో ఉన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. దర్యాప్తు అధికారి దగ్గర పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని కాకాణికి హైకోర్టు షరతు విధించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను దాటి వెళ్లడానికి వీల్లేదని కండీషన్ పెట్టింది. ఛార్జిషీట్ దాఖలు చేసే వరకు నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టరాదని షరతు విధించింది.
బిరదవోలు శ్రీకాంత్ రెడ్డికి అస్వస్థత..
మరోవైపు.. క్వార్ట్జ్ అక్రమ రవాణా కేసులో నిందితుడిగా రిమాండ్‌లో ఉన్న వైసీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. గుండెనొప్పితో నెల్లూరు జీజీహెచ్‌లో చేరారు. రుస్తుం మైనింగ్ కేసులో ఏ-12గా రిమాండ్ ఖైదీగా ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి. ఆయనకు గుండె నొప్పి రావటంతో వైద్యుల సూచనల మేరకు నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జీజీహెచ్‌లోని కార్డియాలజీ విభాగంలో వైద్య పరీక్షలు చేసి ప్రిజనర్స్ వార్డులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. స్పెషల్ రూమ్ కావాలని శ్రీకాంత్ రెడ్డి కోరగా జైలు అధికారులు నిరాకరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా లోకేశ్ ఢిల్లీ పర్యటన..
వైఎస్ జగన్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్..
Read Latest AP News And Telugu News