ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: అంతా కృష్ణమయం... ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ వేను జాతికి అంకితం చేసిన ప్రధాని

ABN, Publish Date - Aug 17 , 2025 | 02:57 PM

ఆగస్టు మాసం ఫ్రీడం, రివల్యూషన్ రంగులతో కలర్‌ఫుల్‌గా ఉందని ప్రధాని అన్నారు. ఈరోజు ఢిల్లీలో అభివృద్ధి రివల్యూషన్ కనిపిస్తోందన్నారు. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్డు అనుసంధానమయ్యాయని చెప్పారు.

PM Modi

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కీలకమైన ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే సెక్షన్, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-2 ప్రాజెక్టులను ఆదివారంనాడు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభించారు. ఈ రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కొత్త రోడ్లు ప్రారంభంతో గురుగ్రామ్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. రూ.11,000 కోట్లతో ఈ ప్రాజెక్టులను చేపట్టాను. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ వేను దాదాపు 7,716 కోట్లతో చేపట్టారు. ఢిల్లీ శివారు ప్రాంతాలను కలుపుతూ 76 కిలోమీటర్లు అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్ కారిడార్ ప్రాజెక్టుతో అనుసంధానం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానితో పాటు రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎక్స్‌ప్రెస్‌వే పేరు ద్వారక అని, ఈ ఈవెంట్ జరుగుతున్నది రోహిణిలోనని, తాను కూడా ద్వారకాధీష్‌ గడ్డకు చెందిన వాడినని, అంతా కృష్ణమయంగానే కనిపిస్తోందని అన్నారు. ఆగస్టు మాసం ఫ్రీడం, రివల్యూషన్ రంగులతో కలర్‌ఫుల్‌గా ఉందన్నారు. ఈరోజు ఢిల్లీలో అభివృద్ధి రివల్యూషన్ కనిపిస్తోందన్నారు. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్డు అనుసంధానమయ్యాయని చెప్పారు. ఢిల్లీ ఎన్‌సీఆర్, గురుగావ్ మొత్తానికి ఈ అనుసంధానం ఎంతగానే ఉపయోగపడుతుందన్నారు. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి దేశ ఆర్థికవ్యవస్థ, స్వయం సమృద్ధి, దేశ ఆత్మస్థైరంపై తాను ఎంతో భరోసా వ్యక్తం చేశానని, యావత్ ప్రపంచం ఇండియా వైపు చూసినప్పుడు వారి మొదటి చూపు ఢిల్లీపై పడుతుందని అన్నారు. అందువల్ల ఢిల్లీని మనం అభివృద్ధి మోడల్‌గా తీర్చిదిద్దాలని, అందరూ ముక్తకంఠంతో 'ఇది అభివృద్ధి భారతదేశ రాజధాని' అని నినదించాలని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేఖాగుప్తా నాయకత్వంలో ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం యుమునా నదీ జలాల ప్రక్షాళనకు నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని చెప్పారు. ఇప్పటికి 16 లక్షల మెట్రిక్ టన్నుల పూడిక తొలగించారని, స్వల్వ వ్యవధిలోనే 650 DEVI ఎలక్ట్రిక్ బస్సులు ఢిల్లీలో ప్రారంభించారని, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సులు 2,000కు చేరుతాయన్నారు. గ్రీన్ ఢిల్లీ-క్లీన్ ఢిల్లీ సంకల్పానికి ఈ చర్యలు ఎంతో దోహదం చేస్తాయనన్నారు. చాలా ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, గత ప్రభుత్వాలు ఏవిధంగా ఢిల్లీని ఎంతగా ధ్వంసం చేసి, వెనుకబాటుకు తీసుకువెళ్లాయో అంతా చూశామని అన్నారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఢిల్లీ సిటీని బయటకు తీసుకువచ్చేందుకు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అంకుంఠిత దీక్షతో పనిచేస్తుందనే నమ్మకం తనకు ఉందని ప్రధాని అన్నారు.

ఇవి కూడా చదవండి..

హిమాచల్‌లో భారీ వర్షాలు.. ఇప్పటివరకు 261 మంది మృతి

జమ్మూకాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్‌ల విలయం.. అసలెందుకిలా జరుగుతోంది..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2025 | 03:03 PM