ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

ABN, Publish Date - May 22 , 2025 | 11:35 AM

రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ్‌నోక్ రైల్వేస్టేషన్ నుంచి 18 రాష్ట్రాల్లో ఆధునీకరించిన 103 అమృత్ రైల్వే స్టేషన్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.

జైపూర్, మే 22: రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ్‌నోక్ రైల్వేస్టేషన్ నుంచి 18 రాష్ట్రాల్లో ఆధునీకరించిన 103 అమృత్ రైల్వే స్టేషన్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో తెలంగాణలో 3 ఏపీలో 1, యూపీలో 19, గుజరాత్ 18, మహారాష్ట్రలో 15, రాజస్థాన్‌లో 8 రైల్వేస్టేషన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ పాల్గొన్నారు. అంతకుముందు బికనీర్‌లోని కర్ణిమాత ఆలయాన్ని ఆయన సందర్శించారు. అమ్మవారికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మ వారి తీర్థ ప్రసాదాలను ఆలయ పూజారులు.. ప్రధాని మోదీకి అందజేశారు. అనంతరం బికనీర్ ఎయిర్ బేస్‌ను మోదీ సందర్శించారు. మరోవైపు బికనీర్‌ సమీపంలో పాలనా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.


ఆపరేషన్ సిందూర్ అనంతరం తొలిసారిగా ప్రధాని మోదీ రాజస్థాన్‌లో పర్యటించారు. ఇంకా చెప్పాలంటే.. ఏప్రిల్ 22వ తేదీ పహల్గాంలో పర్యాటకులే లక్ష్యం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. అలాంటి వేళ.. ఆపరేషన్ సింధూర్‌ను ప్రభుత్వం చేపట్టింది. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మందికిపైగా ఉగ్రవాదులు మరణించారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన సరిగ్గా నెల రోజులకు ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని బికనీర్ ఎయిర్ బేస్‌ను సందర్శించడం గమనార్హం.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు

జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కీలక ప్రకటన

For National News And Telugu News

Updated Date - May 22 , 2025 | 12:27 PM