Share News

Anakapalle: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు

ABN , Publish Date - May 22 , 2025 | 10:52 AM

అచ్యుతపురం శివారులో పలు అపార్ట్‌మెంట్లు అద్దెకు తీసుకుని నెలకు రూ. 18 లక్షలు చెల్లిస్తూ ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించి 150 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 30 మందిపై కేసు నమోదు చేశారు.

Anakapalle: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు

అనకాపల్లి, మే 22: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టును అనకాపల్లి పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించి 150 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. 30 మందిపై కేసులు నమోదు చేశారు. సైబర్, ఆన్ లైన్ మోసాలపై మంగళవారం రాత్రి జిల్లా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈ మోసాలకు పాల్పడుతున్న ముఠాలపై జిల్లా పోలీసులు గత రెండు రోజులుగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఆ క్రమంలో అచ్యుతాపురం శివారులోని పలు అపార్ట్‌మెంట్లపై దాడి చేసి.. ఈ మోసాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ అపార్ట్‌మెంట్లను ఈ ముఠా అద్దెకు తీసుకుని ఈ ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు, బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన కీలక డేటాను పోలీసులు సేకరించారు. విదేశీయుల ఖాతాలను లక్ష్యంగా చేసుకుని ఈ సైబర్ మోసాలకు ఈ ముఠా పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అపార్ట్‌మెంట్లకు నెలకు రూ. 18 లక్షలు అద్దెగా చెల్లిస్తున్నట్లు పోలీసులు విచారణలో బహిర్గతమైంది. అయితే ఈ అరెస్టయిన వారంతా యువతి యువకులే కావడం గమనార్హం. స్థానిక పోలీసులతోపాటు సైబర్ పోలీసులు ఈ దాడిలో పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు.. వైసీపీ నేతపై కేసు నమోదు

జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కీలక ప్రకటన

For Andhrapradesh News and Telugu News

Updated Date - May 22 , 2025 | 12:34 PM