ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pamban Bridge: పాంబన్ వంతెనను ప్రారంభించిన మోదీ

ABN, Publish Date - Apr 06 , 2025 | 02:46 PM

పాంబన్‌ పాత వంతెన దెబ్బతినడంతో దాని పక్కనే కొత్త వంతెన నిర్మాణానికి 2019 మార్చి 1న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వంతెన నిర్మాణానికి కోసం మొదట రూ. 250 కోట్లు కేటాయించింది. కానీ వంతెన పూర్తయ్యేనాటికి వ్యయం రూ. 535 కోట్లకు పెరిగింది.

చెన్నై: భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన పాంబన్ వంతెన (Pamban Bridges)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆదివారంనాడు ప్రారంభించారు. అనంతరం జాతికి అంకితం చేశారు. కొత్త రైలుబ్రిడ్జిని, కొత్త లిఫ్ట్‌ను, రామేశ్వరం-తాంబరం రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. భారతదేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ రైల్వే సముద్ర వంతెన ఇది. రామసేతువుతో చారిత్రక సంబంధం ఉన్న ఈ ప్రాంతానికి ఆధునిక సాంకేతికతతో నిర్మించిన కొత్త వంతెన ప్రాధాన్యతను సంతరించుకుంది.

Ayodhya Surya Tilak: అయోధ్యలో కన్నుల పండువగా నవమి వేడుకలు లైవ్..


పాంబన్‌ పాత వంతెన దెబ్బతినడంతో దాని పక్కనే కొత్త వంతెన నిర్మాణానికి 2019 మార్చి 1న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వంతెన నిర్మాణానికి కోసం మొదట రూ. 250 కోట్లు కేటాయించింది. కానీ వంతెన పూర్తయ్యేనాటికి వ్యయం రూ. 535 కోట్లకు పెరిగింది. ఓడల రాకపోకల కోసం పాత వంతెన రెండుగా విడిపోయేది. అయితే కొత్తగా నిర్మించిన రైల్వే వంతెన మార్గం అలా విడిపోకుండా మధ్యలో భాగం లిఫ్టుల ద్వారా నిలువుగా పైకి లేచేలా (వర్టికల్‌ లిఫ్ట్‌) రూపొందించారు.మోటార్ల సాయంతో రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా లిఫ్ట్‌ను ఎత్తుతారు. 660 టన్నుల బరువైన 72.5 మీటర్ల వంతెన భాగాన్ని ఇప్పుడు కేవలం 5.20నిమిషాల్లో పూర్తిస్థాయిలో పైకి లేపవచ్చు. ఈ వంతెన కింద నుంచి 22 మీటర్లు ఎత్తయిన ఓడలు కూడా వెళ్లగలవు. ఇందులో వర్టికల్‌ బ్రిడ్జి సాంకేతికతను స్పెయిన్‌ నుంచి తీసుకురాగా, మిగిలినవి దేశీయంగా సిద్ధం చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన రైల్వే సీనియర్‌ ఇంజనీర్‌ నడుపూరు చక్రధర్‌ ఈ వంతెన నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారు.


రామేశ్వరం-తాంబరం పత్యేక రైలు

రామేశ్వరం-తాంబరం ప్రత్యేక రైలును ప్రధాని మోదీ ఆదివారంనాడు ప్రారంభించారు. వంతెన కింద ప్రయాణించిన కోస్ట్ గార్డ్ నౌకకు పచ్చజెండా ఊపారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, తమిళనాడు గవర్నర్ రవి, తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు తదితరులు పాల్గొన్నారు. కొత్త వంతెన మీదుగా తొలి రైలులో విద్యార్థులు, ప్రయాణికులు సందడి చేశారు.


ఇవి కూడా చదవండి..

Roller Coaster Tragedyl: మరికొన్ని నెలల్లో పెళ్లి.. సరదా ప్రాణం తీసింది

Indian Air Force: నాలుగు రోజుల్లోనే ఎయిర్ ఫోర్స్‌కు మరో పెద్ద దెబ్బ

For National News And Telugu News

Updated Date - Apr 06 , 2025 | 03:31 PM