PM Modi Cancels 3 Nation Trip: ఆపరేషన్ సిందూర్.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు రద్దు
ABN, Publish Date - May 07 , 2025 | 02:03 PM
పాక్‌తో తీవ్ర స్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోదీ మూడు ఐరోపా దేశాల పర్యటనలను రద్దు చేసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రధాని చేపట్టాల్సిన పలు విదేశీ పర్యటనలు రద్దయ్యాయి. రద్దుకు గల కారణాలను కేంద్రం వెల్లడించినప్పటికీ దేశీయ అంశాలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా విదేశీ పర్యటనలు రద్దైనట్టు తెలుస్తోంది.
ఈ నెలలో క్రోయేషియా, నార్వే, నెదర్‌ల్యాండ్స్ పర్యటించాల్సి ఉండగా ఇది రద్దైంది. మరో రెండు రోజుల్లో చేపట్టాల్సిన రష్యా పర్యటనను కూడా ప్రధాని మోదీ రద్దు చేసుకున్నారు. నాజీలపై సోవియట్ యూనియన్ విజయాన్ని పుస్కరించుకుని మే 9 విక్టరీ డే వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొనాల్సి ఉండగా పర్యటన చివరి నిమిషంలో రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని రష్యా ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. భారత్ తరపున మరో అధికారి హాజరు కావొచ్చని అన్నారు.
పహల్గాం దాడికి కారణమైన పాక్ ఉగ్రమూకలను అంతమొందించేందుకు భారత్ దయాది దేశంలోని ఉగ్రస్థావరాలపై సైనిక దాడులు బుధవారం అర్ధరాత్రి1.44 గంటలకు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం తొమ్మిది స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 70కి పైగా ఉగ్రవాదులు అంతమయ్యారు. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబసభ్యులు 10 మంది కూడా అంతమయ్యారు.
ఇదిలా ఉంటే, ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో భారత ప్రధాని మోదీ రాష్ట్రపతి ముర్ముతో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అంతకుమునుపు, కేబినెట్ సమావేశంలో పాల్గొన్న ప్రధాని పరిస్థితిని సమీక్షించారు. ఇక పహాల్గాం బాధితుల తరుపున ప్రతీకారం తీర్చుకున్న త్రివిధ దళాలను దేశప్రజలు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ప్రముఖలు మొదలు సామాన్యుల వరకూ సోషల్ మీడియావేదికగా సెల్యూట్ చేస్తున్నారు. ప్రధాని మోదీ కూడా త్రివిధ దళాలను, కేబినెట్‌ను ఈ సందర్భంగా ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి:
ఆపరేషన్ సిందూర్‌లో వాడిన ఈ మిసైల్స్ గురించి తెలుసా
పాక్‌పై ఆపరేషన్ సింధూర్ ప్రారంభం.. 9 ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు
రేపే సెక్యూరిటీ డ్రిల్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Updated Date - May 07 , 2025 | 02:15 PM