ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: సీఎం సారూ.. స్కూలు సీటు కావాలి

ABN, Publish Date - Jun 23 , 2025 | 07:02 PM

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారంనాడు లక్నోలో నిర్వహించిన జనతా దర్బార్‌లో ఓ చిన్నారి పాల్గొంది. తన మనసులోని మాటను ముద్దుముద్దు మాటలతో వెల్లడించింది.

Yogi Adityanath

లక్నో: ప్రజా సమస్యల వేదికగా నేతలు జనతా దర్బార్‌ను ఏర్పాటు చేసినప్పుడు సహజంగానే జనం సమస్యలు ఏకరవుతుంటారు. చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలు పరిష్కారానికి సైతం నోచుకుంటాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సోమవారంనాడు లక్నోలో నిర్వహించిన జనతా దర్బార్‌లో ఓ చిన్నారి పాల్గొంది. తన మనసులోని మాటను ముద్దుముద్దు మాటలతో వెల్లడించింది. దీంతో సీఎం మరింత మురిపంగా పాపతో సంభాషించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు అందరినీ అకట్టుకుంటూ వైరల్ అవుతోంది.

జనతా దర్బార్‌కు వచ్చిన చిన్నారి .. సీఎం తన దగ్గరకు రాగానే 'ప్లీజ్ నాకు స్కూలులో సీటు ఇప్పించండి' అని కోరింది. కళ్లు మిలమిల లాడిస్తూ ఎలాంటి బెరుకు లేకుండా పాప తన కోరికను వెల్లడించడంతో సీఎం చిరునవ్వులు చిందించారు. 'ఏ స్కూలుకు వెళ్లాలనుకుంటున్నావు? ఏ క్లాసులో చేరుతావు? పదో తరగతా? పదకొండో తరగతా?' అని సరదాగా ప్రశ్నించారు. ఆ చిన్నారి అమాయకత్వంతో కూడిన సమాధానమిస్తూ 'నాకు పేరు తెలియదు' అంటూ నవ్వేసింది. పాప సమాధానంతో అక్కడున్న వారు సైతం హాయిగా నవ్వుకున్నారు. వెంటనే సీఎం తన పక్కనే ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ (హోం) సంజయ్ ప్రసాద్‌కు ఆ చిన్నారి ఇచ్చిన అప్లికేషన్ అందజేశారు. పాపను వెంటనే స్కూలులో చేర్చమంటూ ఆదేశించారు.

సీఎం జనతా దర్బార్‌ సందర్భంగా 65 మందికి పైగా ప్రజలు తమ విజ్ఞాపన పత్రాలను అందజేశారు. ముఖ్యమంత్రి ఒక్కొక్కరి సమస్యలను ఓపిగ్గా విని నిర్దిష్ట సమయం లోగా చర్యలు తీసుకోవాలని అధికారులకు అదేశాలు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి..

గుజరాత్‌లో బీజేపీ, ఆప్‌కు చెరో సీటు, కేరళలో కాంగ్రెస్ గెలుపు

6 రోజులు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ

For National News And Telugu News

Updated Date - Jun 23 , 2025 | 08:23 PM