Captain Mohan Ranganathan: పైలట్ కావాలనే కూల్చేశాడా
ABN, Publish Date - Jul 13 , 2025 | 03:00 AM
విమానంలో ఒక్కసారిగా ఇంధన కంట్రోల్ స్విచ్‌లు ఆగిపోవడం..
ఇది కావాలని చేసిన మానవ చర్యే ప్రముఖ నిపుణుడు కెప్టెన్ మోహన్ రంగనాథన్
న్యూఢిల్లీ, జూలై 12: విమానంలో ఒక్కసారిగా ఇంధన కంట్రోల్ స్విచ్‌లు ఆగిపోవడం.. దీనిపై కాక్‌పిట్‌లోని పైలట్ల మధ్య సాగిన సంవాదం గమనిస్తే, విమానాన్ని పైలట్ కావాలనే కూల్చివేసినట్టు అనిపిస్తోందని ప్రముఖ విమానయాన నిపుణుడు, కెప్టెన్ మోహన్ రంగనాథన్ అభిప్రాయపడ్డారు. ఏఏఐబీ ప్రాథమిక నివేదికపై ఓ ఆంగ్ల చానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. ‘కచ్చితంగా మానవ చర్యే విమాన ప్రమాదానికి కారణం. దాని అంతట అది ఆటోమేటిక్‌గానో లేక పవర్ ఫెయిల్యూర్ అయిన కారణంగానో ఈ ప్రమాదం జరిగే చాన్స్ లేదు. దీని ఇంధన స్విచ్‌లు స్లైడింగ్ తరహావి. ఇంధన సెలక్టర్లను కిందకు, మీదకు కదిలించాలంటే వాటిని బలంగా పట్టుకుని లాగాలి. అనుకోకుండా వాటంతటవే ‘ఆఫ్’ అయ్యే అవకాశమే లేదు. ఇంధన సెలక్టర్లను కావాలనే ఆఫ్’ మోడ్‌లోకి తెచ్చారు’’ అని పేర్కొన్నారు. ఇక ఏఏఐబీ నివేదికలో పస లేదని, మరింత లోతుగా విచారణ సాగాల్సిన అవసరం ఉందని నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్ అన్నారు.
Updated Date - Jul 13 , 2025 | 03:01 AM