ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

ABN, Publish Date - May 09 , 2025 | 02:14 PM

Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖులు సైతం తప్పుడు ప్రచారాలకు తెర తీశారు. యుద్ధంతో.. ఇండియాతో సంబంధం లేని వీడియోలు, ఫొటోలు పోస్టు చేస్తున్నారు. వాటిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేస్తోంది. నిజానిజాలు బయటపెడుతోంది.

India Pakistan War

భారత్, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ మీడియా, సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలకు తెరలేపాయి. పెద్ద ఎత్తున అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖులు సైతం తప్పుడు వీడియోలను, ఫొటోలను పోస్టు చేస్తున్నారు. భారత ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉక్కుపాదం మోపుతోంది. నిజా నిజాలను బయటపెడుతోంది.


జమ్మూ ఎయిర్ ఫోర్స్ వీడియో

మహ్మద్ అలీ రెజా రజు అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశాడు. ‘ బ్రేకింగ్ .. ఇండియాలోని జమ్మూ ఎయిర్ బేస్‌లో చాలా చోట్ల ప్రభావం పడ్డట్టు తేలింది’ అని రాసుకొచ్చాడు. దానిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఆ వీడియో 2021, కాబూల్ ఎయిర్‌పోర్టుకు సంబంధించినదని తెలిపింది.


పాక్ బాంబుల వర్షం ..

పాకిస్తాన్ ఆర్మీ ఇండియాపై బాంబుల వర్షం కురిపించిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో ఆ వీడియో గేమింగ్ వీడియో అని తేలింది.


సుకోయ్ SU-30MKI కూల్చివేత

ఇండియన్ ఆర్మీకి చెందిన సుకోయ్ SU-30MKI పాకిస్తాన్‌లో కూలిపోయిందని.. ఓ పైలట్‌ను ప్రాణాలతో పట్టుకున్నారని ఓ పాక్ వ్యక్తి పోస్టు పెట్టాడు. ఆ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌ చేసింది. అది ఫేక్ అని తేల్చింది. ఆ సుకోయ్ SU-30MKI .. 2014 సంవత్సరంలో మహారాష్ట్రలో కూలిపోయినట్లు తెలిపింది.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం.. తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం

Operation Sindoor: దేశంలోకి చొరబాటుకు యత్నం.. 7గురు టెర్రరిస్టులు హతం

Updated Date - May 09 , 2025 | 02:17 PM