10th class failure: పదిలో ఆరు సబ్జెక్టులూ ఫెయిల్
ABN, Publish Date - May 04 , 2025 | 05:15 AM
పదో తరగతి పరీక్షలో అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయిన అభిషేక్ తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా కేక్ కట్ చేసి వేడుక చేసుకున్నారు. పునరాలోచన చేసే అవకాశమున్నట్లు పేర్కొని కుమారుడికి ధైర్యం చెప్పారు.
కేక్ కట్ చేసి ధైర్యం నింపిన తల్లిదండ్రులు
బెంగళూరు, మే 3(ఆంధ్రజ్యోతి): పదో తరగతిలో తమ కుమారుడు అన్ని సబ్జెక్టులూ ఫెయిలైనా ఆ తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకున్నారు. పైగా కేక్ కట్ చేసి వేడుక చేసి ధైర్యం చెప్పారు. బాగల్కోటె జిల్లా నవనగరకు చెందిన అభిషేక్ పదో తరగతి పరీక్షల్లో ఆరు సబ్జెక్టుల్లోనూ ఫెయిలయ్యాడు. అన్ని సబ్జెక్టులూ కలిపి 625కు 200 మార్కులు వచ్చాయి. దీంతో సహ విద్యార్థులు కొందరు అభిషేక్‌ను హేళన చేశారు. కుమారుడి పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు.. ఏమాత్రం ఆలోచించకుండా ఓ కేక్ తెప్పించి కట్ చేయించి వేడుక చేశారు. పదో తరగతి పరీక్షలు మరోసారి రాసుకోవచ్చని, ఫెయిలైనంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గట్టి ధైర్యం చెప్పారు.
ఇవి కూడా చదవండి
Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి
IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..
Updated Date - May 04 , 2025 | 05:15 AM