Pak Attack on Golden Temple Foiled: అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంపై డ్రోన్ దాడులకు పాక్ యత్నం.. తిప్పికొట్టిన భారత్
ABN, Publish Date - May 19 , 2025 | 11:23 AM
అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం టార్గెట్‌గా పాక్ జరిపిన డ్రోన్, మిసైల్ దాడులను పూర్తిస్థాయిలో తిప్పికొట్టామని ఆర్మీ అధికారి తాజాగా పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆపరేషన్ సిందూర్‌లో (Operation Sindoor) భాగంగా పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేశాక దాయాది దేశం.. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని (Golden Temple) టార్గెట్ చేసుకుందని 15వ ఇన్‌ఫాంట్రీ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ కార్తిక్ సీ శేషాద్రి సోమవారం తెలిపారు. మిసైళ్లు, డ్రోన్స్‌తో దాడికి యత్నించిందని అన్నారు. ఈ విషయన్ని ముందుగానే ఊహించిన భారత ఆర్మీ (Indian Army) ఆ ప్రయత్నాలు పూర్తిస్థాయిలో తిప్పికొట్టిందని చెప్పారు.
‘‘పాక్ అకారణ దాడులకు దిగుతుందని ఊహించాము. దాయాదికి సరైన లక్ష్యాలు ఏవీ లేవు కాబట్టి మిలిటరీ లక్ష్యాలతో పాటు మతమరమైన కట్టడాలు, పౌర నిర్మాణాలను టార్గెట్ చేస్తుందని భావించాము. స్వర్ణ దేవాలయం పాక్‌కు ప్రధాన టార్గెట్ కావొచ్చని అనిపించింది. దీంతో, గగనతల రక్షణ వ్యవస్థలను అక్కడ మోహరించాము. పాక్ దాడులను తిప్పికొట్టేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాము. ఆర్మీలోని ఎయిర్ డిఫెన్స్ గన్నర్స్ పాక్ ప్రణాళికలకు అడ్డుకట్ట వేశారు. దాయాది ప్రయోగించిన డ్రోన్స్, మిసైల్స్‌ను తిప్పిపొట్టాము. గోల్డెన్ టెంపుల్‌కు పూర్తిస్థాయి రక్షన ఇచ్చాము’’ అని తెలిపారు.
భారత గగనతల వ్యవస్థలకు కీలకమైన ఆకాశ్ మిసైల్స్, ఎల్-70 ఎయిర్ డిఫెన్స్ గన్స్‌తో స్వర్ణ దేవాలయాన్ని ఎలా కాపాడుకుందీ ఆర్మీ సోమావారం వివరించింది. అమృత్‌సర్‌తో పాటు పంజాబ్ లోని ఇతర నగరాలను కూడా పాక్ దాడుల నుంచి కాపాడుకున్నట్టు మేజర్ జనరల్ చెప్పారు.
ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పాక్ లోని పలు స్థావరాలను కూడా తాము టార్గెట్ చేసినట్టు మేజర్ జనరల్ కార్తిక్ సీ శేషాద్రి తెలిపారు. పాక్‌లోని మురిద్కే, బహావల్‌పూర్‌లో ఉగ్రవాద శక్తుల ప్రధాన కేంద్రాలను అత్యంత కచ్చితత్వంతో టార్గెట్ చేశామని చెప్పారు.
భారత గగనతల రక్షణ వ్యవస్థ పాక్ దాడులను పూర్తిస్థాయిలో తిప్పికొట్టిన విషయం తెలిసిందే. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైల్స్, మైక్రో యూఏవీలు, లాయిటరింగ్ మ్యునిషన్స్ వంటి వాటిని పూర్తిస్థాయిలో భారత బలగాలు అడ్డుకోవడంతో పాటు ప్రతిగా పాక్ మిలిటరీ స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేసి దిమ్మతిరిగే షాకిచ్చారు.
ఇవీ చదవండి:
ట్రంప్ ఎఫెక్ట్.. పాత ఐఫోన్‌లను రిపేర్ చేసుకుంటున్న అమెరికన్లు
ట్రంప్ తన పంతం నెగ్గించుకుంటే.. భారత్‌కు ఏటా 18 బిలియన్ డాలర్ల నష్టం
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 19 , 2025 | 11:38 AM