India Vs Pakistan: సరిహద్దు వద్ద పాక్ మళ్లీ కాల్పులు..
ABN, Publish Date - Apr 26 , 2025 | 08:25 AM
India Vs Pakistan: పాకిస్థాన్ తన తెంపరితనాన్ని చాటుకొంటుంది. ఇరుదేశాలకు చెందిన సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద మరోసారి పాక్ కాల్పులకు తెగబడింది. అయితే భారత్ తగిన రీతిలో స్పందించి.. ఆ దేశానికి గట్టి జవాబు ఇచ్చింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: పాకిస్థాన్ తన తెంపరితనాన్ని మళ్లీ మళ్లీ చాటుకోంటుంది. ఇప్పటికే పహల్గాంలో ఉగ్రదాడి చేసి 26 మందిని బలి తీసుకుంది. అంతటితో ఆగకుండా సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద రోజుల వ్యవధిలోనే మరోసారి భారత్ భూభాగంపైకి కాల్పులకు ఆ దేశం తెగబడింది. శుక్రవారం రాత్రి సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత్ పోస్టులపైకి కాల్పులు జరిపింది.
దీంతో భారత్ వెంటనే స్పందించి.. పాక్‌పై కాల్పులు జరిపి దీటైన సమాధానమిచ్చింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన చోటు చేసుకొన్న తర్వాత పాక్ ఈ విధంగా వ్యవహరించడం ఇది రెండో సారి. ఇక పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన కొన్ని గంటలకే.. నియంత్రణ రేఖ వద్ద భారత్ భూభాగంలోని సైనిక పోస్టులపైకి పాక్ సైన్యం కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ పహల్గాంలో ఉగ్రదాడికి తామే బాధ్యులమంటూ పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ రిసిస్టెన్స్ ఫ్రంట్ ఇప్పటికే ప్రకటన చేసిన విషయం విధితమే.
ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ ఘటపై బారత్ తీవ్రంగా స్పందించింది. అందులోభాగంగా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్థానీలు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అందుకు 48 గంటల గడువు విధించింది.
ఇక న్యూఢిల్లీలోని పాక్ రాయబారిని సైతం దేశం వదిలి వెళ్లాని సూచించింది. అందుకు వారం గడువును విధించింది. వీటితో పాటు కీలక నిర్ణయాలు తీసుకొంది. మరోవైపు పాకిస్థాన్ సైతం ఇదే రీతిలో స్పందించింది. భారత్‌తో చేసుకొన్న సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే భారత్‌కు చెందిన విమానాలు తమ దేశ గగన తలంలో విహరించరాదని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో యూరప్, యూక్, ఉత్తర అమెరికాతోపాటు మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్ల వలసిన విమానాలన్నీ చుట్టు తిరిగి వెళ్తున్నాయి. దీంతో ప్రయాణ సమయం అధికమవుతోంది. దీంతో భారత్‌లోని పలు విమానయాన సంస్థలు.. తమ ప్రయాణికులకు పలు విజ్జప్తులు చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Pahalgam Terror Attack: అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం
Updated Date - Apr 26 , 2025 | 08:39 AM