ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India Vs Pakistan: భారత్ దాడులతో పాక్‌కు భారీ నష్టం

ABN, Publish Date - May 22 , 2025 | 04:43 PM

India Vs Pakistan: పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ లక్ష్యంగా భారత్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల కారణంగా పాకిస్థాన్ పీకల్లోతు నష్టాలను చవి చూస్తున్నట్లు తెలుస్తోంది.

India Attack on Pakistan

న్యూఢిల్లీ,మే 22: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ కారణంగా.. పాకిస్థాన్ తీవ్ర నష్టాలను చవి చూస్తోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పాక్ వైమానిక దళానికి చెందిన నాలుగు ఎఫ్ 16 సూపర్ సోనిక్ ఫైటర్ జెట్లను భారత క్షిపణి వ్యవస్థ కూల్చి వేసింది. అలాగే పాకిస్థాన్ వైమానిక దళంలో అత్యంత కీలకమైన సర్గోదా వైమానిక స్థావరం సైతం తీవ్రంగా దెబ్బతిన్నది. ఇందులోని రాడార్ వ్యవస్థ దాదాపుగా ధ్వంసమైంది. దీంతో వీటిని మరమ్మతులు చేయించాలంటే.. దాదాపు 100 మిలియన్ డాలర్లు అవసరమవుతాయని ఆయా నివేదికలు పేర్కొంటున్నాయి.

అయితే ఎఫ్ 16 వల్ల 349.52 మిలియన్ డాలర్లు, సీ 130 తో 40 మిలియన్ డాలర్లు, హెచ్‌క్యూ కారణంగా 200 మిలియన్ డాలర్లతోపాటు రెండు మొబైల్ కమాండ్ సెంటర్లు 10 మిలియన్ డాలర్లు మేర నష్టపోయాయని సోదాహరణగా ఆయా నివేదికలు వివరించాయి.


భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో నిషేధిత జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలకు చెందిన తొమ్మిది రహస్య స్థావరాలను నెలమట్టం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మందికిపైగా ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే.


సరిగ్గా గత నెల ఇదే రోజు.. అంటే ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలోని పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ ఘటనకు పాకిస్థాన్ కారణమని భారత్ ఆధారాలను సేకరించింది. ఈ నేపథ్యంలో పాక్‌కు వ్యతిరేకంగా భారత్ చర్యలు చేపట్టింది. అందులోభాగంగా సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. అలాగే పాకిస్థాన్ సైతం భారత్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంది. ఆ క్రమంలో సిమ్లా ఒప్పందాన్ని పాక్ రద్దు చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాంటి వేళ భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అందుకు ప్రతిగా పాకిస్థాన్ భారత్ సరిహద్దుల్లోని భూభాగంపైకి డ్రోనులు, క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో 27 మంది భారతీయులు మరణించగా.. 70 మంది గాయపడ్డారు. అనంతరం పాకిస్థాన్ దిగి వచ్చింది. దీంతో ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. కానీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మాత్రం ఇంకా కొనసాగుతోన్న విషయం విదితమే.

ఈ వార్తలు కూడా చదవండి..

పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టాం

భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్

For National News And Telugu News

Updated Date - May 22 , 2025 | 05:36 PM