Delhi: పాక్ హైకమిషన్ అధికారిని బహిష్కరించిన భారత్
ABN, Publish Date - May 21 , 2025 | 08:31 PM
పాక్‌తో గూఢచర్యానికి పాల్పడిన కారణంగా ఇటీవల అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంపై విచారణ సందర్భంలో పాక్ హైకమిషన్ సిబ్బంది పేరు వెలుగుచూసిందని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ హై కమిషన్‌కు చెందిన మరో అధికారిపై భారత్ చర్యలు తీసుకుంది. దేశం నుంచి బహిష్కరించింది. కార్యాలయ పరిధిని దాటి కార్యకలాపాలు సాగిస్తున్నారని పేర్కొంటూ 24 గంటల్లోపు ఆయనను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ బుధవారంనాడు ఆదేశాలు వెలువరించింది. పాక్ హైకమిషన్ అధికారిని బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని భారత్‌లో పాక్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న అధికారికి తెలియజేసింది. పాక్‌తో గూఢచర్యానికి పాల్పడిన కారణంగా ఇటీవల అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంపై విచారణ సందర్భంలో పాక్ హైకమిషన్ సిబ్బంది పేరు వెలుగుచూసిందని, దాంతో ఆయనపై కేంద్రం తక్షణ చర్యలు తీసుకుందని తెలుస్తోంది.
Video Viral: కన్నడంలో మాట్లాడనంటూ బ్యాంకు మేనేజర్ వీరంగం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
కాగా, దీనికి ముందు మే 13న కూడా న్యూఢిల్లీలో పాక్ హైకమిషన్‌కు చెందిన ఒక ఉద్యోగిని భారత్ బహిష్కరించింది. అధికార హోదాకు తగ్గట్టు ప్రవర్తించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, 24 గంటల్లోగా ఆయన భారత్ విడిచి వెళ్లాలని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇందుకు బదులుగా పాక్ సైతం ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ సిబ్బంది ఒకరిని దేశం నుంచి బహిష్కరించింది. అధికార హోదాకు తగినట్టు ప్రవర్తించందునే ఆయనపై బహిష్కరణ వేటు వేసినట్టు ప్రకటించింది.
Puja Khedkar: ఆమె డ్రగ్ లార్డా? టెర్రరిస్టా?.. పూజా ఖేడ్కర్‌కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిలు
Sonia andhi-Rahul Gandhi: చిక్కుల్లో సోనియా-రాహుల్.. ఈడీ సంచలన ఆరోపణలు..
Police Encounter: ఎన్‌కౌంటర్‌లో గ్యాంగస్టర్ సభ్యుడికి గాయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 21 , 2025 | 08:33 PM