ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pahalgam Attack: భారత్‌లో పాకిస్థాన్ రక్షణ మంత్రి 'ఎక్స్' ఖాతా నిలిపివేత

ABN, Publish Date - Apr 29 , 2025 | 06:31 PM

పహల్గాం దాడి అనంతరం పాక్ ఉగ్రవాదంపై అడిగిన ప్రశ్నకు ఖవాజా మహమ్మద్ అహ్మద్ సూటిగా సమాధానం చెప్పకుండా, అమెరికా, బ్రిటన్, పశ్చిమా దేశాల కోసం మూడు దశాబ్దాలుగా చెత్తపనులన్నీ చేశామని ఇటీవల వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి (Pakistan Defence Minister) ఖవాజా మహమ్మద్ అసిఫ్ (Khawaja Muhammad Asif) 'ఎక్స్' ఖాతాను భారత ప్రభుత్వం నిలిపి వేసింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారనే కారణంగా కేంద్రం ఈ చర్యలు తీసుకుంది.

Pahalgam Terror Attack: హోం శాఖ కార్యాలయంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం


అమెరికా కోసం చెత్త పనులన్నీ చేశాం

పహల్గాం దాడి అనంతరం పాక్ ఉగ్రవాదంపై అడిగిన ప్రశ్నకు ఖవాజా మహమ్మద్ అహ్మద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సూటిగా సమాధానం దాటవేశారు. అమెరికా, బ్రిటన్, పశ్చిమ దేశాల కోసం మూడు దశాబ్దాలుగా చెత్తపనులన్నీ చేశామని వ్యాఖ్యానించారు. ఇది పొరపాటేనని అర్ధమైందన్నారు. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో తాము పాల్గొనకుండా ఉంటే తిరుగులేని ట్రాక్ రికార్డు ఉండేదన్నారు. పాక్‌లో లష్కరే తొయిబా లేనేలేదన్నారు. పహల్గాం దాడి అనంతరం భారత్ తమపై ప్రతీకార దాడికి అవకాశాలున్నందున బలగాలను అప్రమత్తం చేసినట్టు చెప్పారు.


దీనికి ముందు, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం, భద్రతా సంస్థలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే మతపరమైన కంటెంట్, తప్పుదారి పట్టించే యూట్యూబ్ ఛానెళ్లను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. పాక్ కేంద్రంగా ప్రసారమవుతున్న 16 యూట్యూబ్ ఛానెళ్లను భారత్‌తో నిషేధించింది. ఇందులో డాన్ న్యూస్, సమ్మా టీవీ, ఆరీ న్యూస్, జియో న్యూస్, జీఎన్ఎన్, బోల్ న్యూస్, ఉజైర్ క్రికెట్, ఉమర్ చీమా ఎక్స్‌క్లూజివ్, అస్మా షిరాజి, మునీబ్ ఫరూఖ్, సునో న్యూస్, రజి నామా తదితర యూట్యూబ్ ఛానెళ్లు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

Pakistan: భారత 'గూఢచారి డ్రోన్‌'ను కూల్చేశామన్న పాక్

Kashmir: కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు స్కెచ్.. 48 టూరిస్ట్ స్పాట్స్ మూసివేత..

Viral News: పాకిస్తాన్‎ను 4 ముక్కలు చేయాలి..ఇలా చేస్తేనే వారికి మేలు..

Updated Date - Apr 29 , 2025 | 06:42 PM