ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pakistan Army: బుద్ధి మార్చుకోని పాకిస్తాన్.. 12వ రోజు కూడా కవ్వింపు చర్యలు

ABN, Publish Date - May 06 , 2025 | 08:07 AM

Pakistan Army: ఇండియన్ ఆర్మీ వెహికల్స్‌పై దాడికి పాల్పడ్డ కేసులో అరెస్టైన నిసార్, ముస్తక్‌లను విచారించింది. ఆ ఇద్దరూ కోట్ భవ్‌లాల్ జైలులో ఉన్నారు. వారిని విచారించిన నేపథ్యంలోనే జైళ్లపై దాడి విషయాలు బయటపడ్డాయి.

Pakistan Army

పాకిస్తాన్ ఆర్మీ దుష్ట బుద్ధి మార్చుకోవటం లేదు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న ఈ సమయంలో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. లైన్ ఆఫ్ కంట్రోల్ పొడవునా కాల్పులకు పాల్పడుతోంది. 12వ రోజు కూడా పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. సోమవారం రాత్రి పాక్ రేంజర్లు సరిహద్దుల్లోని పలు చెక్ పోస్టుల వద్ద చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపారు. కుప్వారా, బారాముల్లా, పూంఛ్, రాజౌరి, మెంధర్, నౌషెరా, సుందర్భని, అక్నూర్ సెక్టార్లలో కాల్పులకు తెగబడ్డారు. భారత సైన్యం.. పాక్ రేంజర్లకు ధీటుగా సమాధానం ఇస్తోంది. వారి దుష్ట చర్యల్ని సమర్ధవంతంగా తిప్పికొడుతోంది.


పహల్గామ్ ఉగ్రదాడి తర్వాతినుంచి పాక్ పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తోంది. ఓ వైపు భారత్ తీసుకుంటున్న నిర్ణయాలతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. ఇప్పటికే పాక్‌లోని చాలా మంది అధికారులు యుద్ధం తప్పదని భావిస్తున్నారు. ఒక వేళ యుద్ధం వస్తే దేశం వదలిపారిపోతామని అంటున్నారు. భారత్ మాత్రం యుద్దానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. మరో వైపు భారత్ మీద కక్ష తీర్చుకోవడానికి పాకిస్తాన్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే నిత్యం సరిహద్దుల వెంబడి పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడుతోంది. దీని కారణంగా ఇప్పటి వరకు 26 మంది దాకా ప్రజలు చనిపోయారు.


జైళ్లపై ఉగ్రదాడి కుట్ర

ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్‌లోని జైళ్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. హైప్రొఫైల్ టెర్రిస్టులతో పాటు గ్రౌండ్ వర్కర్లు ఉన్న జైళ్లపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు నేషనల్ ఇన్వెష్టిగేషన్ ఏజెన్సీ హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రదాడి జరిగే అవకాశం ఉన్న జైళ్లలో శ్రీనగర్ సెంట్రల్ జైలు, కోట్ భవ్‌లాల్ జైల్, జమ్మూ జైలు ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ వెహికల్స్‌పై దాడికి పాల్పడ్డ కేసులో అరెస్టైన నిసార్, ముస్తక్‌లను నేషనల్ ఇన్వెష్టిగేషన్ ఏజెన్సీ విచారించింది. విచారణ సందర్భంగా వారు జైళ్లపై ఉగ్ర కుట్ర గురించి బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లోని జైళ్ల సెక్యూరిటీ బాధ్యత నిర్వహిస్తున్న సీఐఎస్‌ఎఫ్ అలర్ట్ అయింది.


ఇవి కూడా చదవండి

Viral Video: ప్రమాదంలో మహిళ ప్రాణాలు.. కుక్క ఎంత పని చేసింది..

Viral Video: ఊహించని విషాదం.. పెళ్లికి ఒకరోజు ముందు..

Updated Date - May 06 , 2025 | 08:41 AM