ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pakistan: పాక్ ఆర్మీ చీఫ్ వింత వ్యాఖ్యలు.. భారత్‌పై మరోసారి నోరు పారేసుకున్న ఆసిం మునీర్..

ABN, Publish Date - Jun 29 , 2025 | 10:58 AM

కరాచీలోని నేషనల్ అకాడమీలో శనివారం జరిగిన కార్యక్రమానికి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన మునీర్ మరోసారి భారత్‌పై ద్వేషం కక్కారు. పాకిస్థాన్‌పై భారత్ రెండుసార్లు అకారణంగా దాడికి పాల్పడిందని వ్యాఖ్యానించారు.

Pakistan Army chief Asim Munir

పాకిస్థాన్ (Pakistan) ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ (Asim Munir) మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకున్నారు. భారత్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఇటీవల వ్యాఖ్యానించిన మునీర్ తాజాగా భారత్‌ను బెదిరించే ప్రయత్నం చేశారు. కరాచీ (Karachi)లోని నేషనల్ అకాడమీలో శనివారం జరిగిన కార్యక్రమానికి మునీర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన మునీర్ మరోసారి భారత్‌పై ద్వేషం కక్కారు. పాకిస్థాన్‌పై భారత్ రెండు సార్లు అకారణంగా దాడికి పాల్పడిందని వ్యాఖ్యానించారు.

భారత్ దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని, పాకిస్థాన్ మాత్రం ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడుతోందని అన్నారు. పాకిస్థాన్ పూర్తిగా ఉగ్రవాదాన్ని అణిచివేసే పనిలో ఉంటే భారత్ మాత్రం ఉద్రిక్తతలు పెంచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పాకిస్థాన్ పూర్తిగా శాంతిని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించిందని కితాబిచ్చుకున్నారు. న్యూఢిల్లీకి వ్యూహాత్మక ముందు చూపు కొరవడిందని, ప్రాంతీయ ఉద్రిక్తతలు రెచ్చగొడుతోందని, మరోసారి తమపై దాడులకు పాల్పడితే బలంగా స్పందిస్తామని మునీర్ వ్యాఖ్యానించారు.

తాజాగా పాకిస్థాన్‌లోని వజీరిస్థాన్‌ ప్రాంతంలో కొందరు తీవ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండిన కారుతో పాక్ సైనికులు వెళ్తున్న కాన్వాయ్‌ని ఢీ కొట్టారు. ఈ దాడిలో 13 మంది పాకిస్థాన్‌ సైనికులు మృతి చెందారు. ఈ దాడి వెనుక భారత్‌ హస్తం ఉందని పాకిస్థాన్ సైన్యం ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.

ఇవి కూడా చదవండి:

కశ్మీర్‌ రిసార్ట్‌లో ఎలుగుబంటి కలకలం

పాక్‌కు కీలక సమాచారం లీక్.. నేవీ ప్రధాన కార్యాలయం ఉద్యోగి అరెస్టు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 29 , 2025 | 12:15 PM