Espionage: పాక్‌కు కీలక సమాచారం లీక్.. నేవీ ప్రధాన కార్యాలయం ఉద్యోగి అరెస్టు
ABN , Publish Date - Jun 26 , 2025 | 08:56 AM
పాక్‌కు కీలక సమాచారాన్ని లీక్ చేస్తున్న నేవీ హెడ్‌క్వార్టర్స్ ఉద్యోగి విశాల్ యాదవ్‌ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అతడు ఏ విషయాలను పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలకు అందజేశాడో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పాక్ కోసం గూఢచర్యానికి పాల్పడుతూ మరో వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఢిల్లీలోని నావికాదళ ప్రధాన కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్న విశాల్ యాదవ్ పోలీసులకు చిక్కాడు (Navy HQ clerk Espionage). భారత్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని అతడు పాక్ హ్యాండ్లర్‌కు అందజేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ పోలీసుల ఇంటెలిజెన్స్ విభాగం అతడిని అదుపులోకి తీసుకుంది.
భారత్‌లో పాక్ నిఘా వర్గాల కార్యకలాపాలను జాగ్రత్తగా గమనిస్తున్నామని ఇంటెలిజెన్స్ విభాగం సీనియర్ పోలీసు అధికారి విష్ణుకాంత్ గుప్తా తెలిపారు. ఈ క్రమంలో యాదవ్ తమ దృష్టిలోకి వచ్చాడని వెల్లడించారు. పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన ఓ మహిళా హ్యాండ్లర్‌తో విశాల్ టచ్‌లో ఉండేవాడు. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన అతడు నష్టాలు మూటగట్టుకున్నాడు. వీటిని భర్తీ చేసుకునేందుకు డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడని పోలీసులు తెలిపారు. పాక్ తరపున గూఢచర్యం చేసినందుకు అతడికి క్రిప్టో కరెన్సీలో చెల్లింపులతో పాటు నేరుగా బ్యాంక్ అకౌంట్‌కు నగదు బదిలీ అయ్యేదని అన్నారు.
ఈ ర్యాకెట్‌లో ఎవరెవరు ఉన్నారో, ఎలాంటి సమాచారం లీకైందో తెలుసుకునేందుకు సెక్యూరిటీ ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ అరెస్టు నేపథ్యంలో సోషల్ మీడియా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. భారత్‌పై కన్నేసేందుకు పాక్ ఏజెన్సీలకు ఇది ప్రధాన మాధ్యమంగా మారిన వైనం ఆందోళన కలిగిస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎలాంటి అనుమానాస్పద యాక్టివిటీ కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సెక్యూరిటీ ఏజెన్సీలు సూచించాయి.
ఇవి కూడా చదవండి:
విమానాన్ని కూల్చేస్తా.. ఎయిర్ ఇండియా సిబ్బందికి మహిళా డాక్టర్ బెదిరింపులు
వరుసగా 51 పుష్ అప్స్.. జనాలను సర్‌ప్రైజ్ చేసిన తమిళనాడు గవర్నర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి