TN Governor: వరుసగా 51 పుష్ అప్స్.. జనాలను సర్‌ప్రైజ్ చేసిన తమిళనాడు గవర్నర్
ABN , Publish Date - Jun 21 , 2025 | 01:32 PM
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తమిళనాడు గవర్నర్ ఏకంగా 51 పుషప్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇంటర్నెట్ డెస్క్: పుష్ అప్స్.. పట్టుమని పది చేయడానికే జనాలకు ముచ్చెమటలు పడుతుంటాయి. కానీ వరుసగా 50కి పైగా పుష్ అప్స్ చేయాలంటే మాత్రం వణుకు తప్పదు. కానీ ఈ ఫీట్‌ను తమిళనాడు గవర్నర్ సునాయాసంగా పూర్తి చేశారు. 73 ఏళ్ల వయసులో పుష్ అప్స్ చేసి వయసు తనకు అసలు అడ్డంకే కాదని నిరూపించారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
శనివారం మదురైలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్ రవి పాల్గొన్నారు. ఈ వేడుకలకు 10 వేల పైచిలుకు విద్యార్థులు కూడా హాజరయ్యారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా గవర్నర్ అత్యంత కచ్చితత్వంతో ఆసనాలు వేశారు. మాజీ ఐపీఎస్ అయిన ఆయన యువతతో పోటీ పడుతూ యోగాసనాలు వేశారు. ఆ తరువాత జనాలు ఎవరూ ఊహించని రీతిలో ఆయన పుష్ అప్స్ చేశారు.
పదో పన్నెండో అంటే అనుకోవచ్చు గానీ ఏకంగా 51 పుష్ అప్స్ అదీ వరుసగా గవర్నర్ చేసుకుంటూ వెళ్లిపోవడం అక్కడి విద్యార్థులను ఆశ్చర్యపరిచింది. నమ్మలేనట్టు చూస్తుండిపోయారు. ఆపై విద్యార్థుల కరతాళ ధ్వనులతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఇక కొందరైతే ఎంతకీ ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయారు. ఆయన వయసు 30 ఏళ్లేనేమో అంటూ కొందరు కామెంట్ కూడా చేశారు. ఇక ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది. వయసు కేవలం ఒక నంబర్ మాత్రమే అంటే ఇదేనేమో అంటూ జనాలూ ఆశ్చర్యపోతున్నారు.
ఇవి కూడా చదవండి:
ఎయిర్‌పోర్టు పరిసరాల్లో నిర్మాణాలపై కేంద్రం నజర్.. నిబంధనలు కఠినతరం
రంగంలోకి కేంద్రం.. ఇరాన్ నుంచి భారత్‌కు 110 మంది విద్యార్థుల తరలింపు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి