Pahalgam Terror Attack: పాక్‌పై భారత్ ఇప్పటివరకూ తీసుకున్న చర్యలు ఏవంటే..
ABN, Publish Date - Apr 25 , 2025 | 08:46 AM
పహెల్గామ్ సూత్రధారి పాక్‌పై భారత్ తీసుకున్న చర్యలు దాయాది దేశానికి చుక్కలు చూపిస్తాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా సింధు జలాల ఒప్పందం నిలుపుదల పాక్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని స్పష్టం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పహెల్గామ్ దాడి కుట్రదారు పాక్‌పై భారత దేశ ప్రజలు రగిలిపోతున్నారు. ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదను చూసి దెబ్బకొట్టేందుకు భారత్ సిద్ధమవుతోందనేందుకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇప్పటికే భారత్ పాక్‌కు చుక్కలు చూపించేలా పలు చర్యలు తీసుకుంది. గురువారం బీహార్‌లో చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ భారత్ పాక్ చర్యలకు బదులిచ్చి తీరుతుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను ప్రపంచపు అంచుల వరకూ వెంటాడి అంతమొందిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ఇక దాడి తరువాత ప్రధాని మోదీ సారథ్యంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ కమిటి తక్షణం పాక్‌పై ఐదు చర్యలకు ఉపక్రమించింది.
సింధు నదీజలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడంతో పాక్‌కు భారత్ భారీ షాకిచ్చింది. పాక్ సాగునీటి, తాగు నీటి అసరాలకు, ఆర్థికానికి కీలకంగా మారిన సింధు నదీ జలాల పంపిణీలో ఆటంకాలు దాయాదికి చుక్కలు చూపించనున్నాయి. ఇక భారత్ పాక్ మధ్య ఉన్న అట్టారీ వాఘా బార్డర్‌ను కూడా ప్రభుత్వం మూసివేసింది. ఇప్పటికే ఈ మార్గం మీదుగా భారత్ వచ్చిన పాకిస్థానీయులు మే 1లోపు దేశాన్ని వీడాలని స్పష్టం చేసింది.
భారత్‌లోని పాక్ మిలిటరీ అనుబంధ సిబ్బందిని తమ దేశానికి తిరిగి వెళ్లాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది. ఇరు దేశాల్లోని దౌత్య కార్యాలయాల్లో సిబ్బందిని 55 నుంచి 30కి కుదించింది.
సార్క్ వీసా మినహాయింపు పథకం నుంచి పాక్ జాతీయులను తప్పించింది. ఇప్పటికే ఈ పథకం కింద భారత్‌లో ఉన్న వారు 48 గంటల్లోపు దేశాన్ని వీడాలని బుధవారం స్పష్టం చేసింది.
ఇక పాకిస్థానీలకు సాధారణ వీసాల జారీని కూడా నిలిపివేస్తున్నట్టు గురువారం భారత్ ప్రకటించింది. ఇప్పటికే జారీ చేసిన వీసాల ఏప్రిల్ 27 వరకే అమల్లో ఉంటయాని పేర్కొంది. మెడికల్ వీసాలు ఏప్రిల్ 29 వరకూ చెల్లుబాటు అవుతాయని చెప్పింది. ఈ గడువు ముగిసేలోపే పాకిస్థానీయులు దేశాన్ని వీడాలని స్పష్టం చేసింది.
ఇక అట్టారీ బార్డర్ వద్ద నిర్వహించే రిట్రీట్ సెరమనీ వేడుకలను కూడా పరిమితంగా నిర్వహిస్తామని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
భారత్‌లో పాక్ ట్విట్టర్ అకౌంట్‌పై వేటు
పాక్ ఆర్మీ చీఫ్ బిన్ లాడెన్ లాంటోడు.. కశ్మీర్ దాడిపై అమెరికా అధికారి తీవ్ర ఆగ్రహం
న్యాయమూర్తులపై మహిళ సంచలన వ్యాఖ్య.. షాకిచ్చిన కోర్టు
Updated Date - May 19 , 2025 | 11:35 PM