ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

NIA To Probe Pahalgam Attack: పహల్గాం దాడిపై దర్యాప్తు బాధ్యతను ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం

ABN, Publish Date - Apr 27 , 2025 | 11:45 AM

పహల్గాం దర్యాప్తుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకి బదిలీ చేస్తూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.

NIA To Probe Pahalgam AttacK

ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం దాడి దర్యాప్తుపై కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దర్యాప్తు బాధ్యతలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి (ఎన్ఐఏ)కి బదిలీ చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో, రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు విచారణ ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు.

‘‘ఐజీ, డీఐజీ, ఎస్పీ నేతృత్వంలోని బృందాలు ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నాయి. వారు చెప్పిన విషయాల ఆధారంగా అసలు ఏం జరిగిందీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాము’’ అని ఎన్ఐఏ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘టెర్రరిస్టులు వచ్చి వెళ్లిన మార్గాలను ఎన్ఐఏ బృందాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఉగ్రకుట్ర మూలాలు కనుక్కునేందుకు ఫారెన్సిక్ బృందాలు ఘటనాస్థలాన్ని జల్లెడ పడుతూ ఆధారాలు సేకరిస్తున్నాయి’’ అని ఎన్ఐఏ తెలిపింది. ఈ దాడిలో 26 మంది మరణించగా పలువురు గాయపడిన విషయం తెలిసిందే. శనివారం ఎన్‌ఐఏ బృందం..దాడి నుంచి బయటపడ్డ వారి వాంగ్మూలాన్ని సేకరించింది.


మరోవైపు, జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుతం క్రియాశీలంగా ఉన్న 14 స్థానిక ఉగ్రవాదుల జాబితాను ఇంటెలిజెన్స్ వర్గాలు విడుదల చేశాయి. వీరిలో లష్కరే తయ్యబా ఉగ్రవాదులు ఎనిమిది మంది, జైషే మహ్మద్ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు చెరో ముగ్గురు ఉన్నారు. ఆ ప్రాంతంలో సుమారు 50 నుంచి 60 మంది ఉగ్రవాదులు ఉండి ఉండొచ్చని నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఈ 14 మందికి సంబంధించి అడ్రస్‌తో సహా పూర్తి వివరాలు సేకరించినట్టు తెలిపాయి. వీరిలో చాలా మంది 20 ఏళ్లల్లో ఉన్న వారేనని, 2021లో పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థల్లో చేరారని వెల్లడించాయి. వీరిలో ఐదుగురు షోపియన్ జిల్లాలో, నలుగురు పుల్వామాలో, ఇద్దరు అనంత్‌నాగ్‌లో, సోపోర్, అవంతీపురా, కుల్గామ్ ప్రాంతాల్లో చెరో ఒకరు యాక్టివ్‌గా ఉన్నట్టు పేర్కొన్నాయి. ఇక ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేసిన భద్రతా దళాలు ఇప్పటివరకూ ఉగ్రమూకలకు చెందిన 9 ఇళ్లను నేలమట్టం చేశాయి.


ఇవి కూడా చదవండి..

రాక్షసత్వం ప్రబలితే.. పహల్గాం దాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ రియాక్షన్

అదే జరిగితే సింధూ నదిలో వారి రక్తం పారుతుంది.. బిలావాల్ భుట్టో పిచ్చి కూతలు

అమెరికా కోసమే ఇదంతా.. ఉగ్రవాదంపై పాక్ రక్షణ శాఖ మంత్రి షాకింగ్ వ్యాఖ్య

Read Latest and International News

Updated Date - Apr 27 , 2025 | 11:58 AM