Share News

Pak Defence Minster: అమెరికా కోసమే ఇదంతా.. ఉగ్రవాదంపై పాక్ రక్షణ శాఖ మంత్రి షాకింగ్ వ్యాఖ్య

ABN , Publish Date - Apr 25 , 2025 | 01:16 PM

అమెరికా, బ్రిటన్, ఇతర పాశ్చాత్య దేశాల కోసమే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామంటూ పాక్ రక్షణ శాఖ మంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి.

Pak Defence Minster: అమెరికా కోసమే ఇదంతా.. ఉగ్రవాదంపై పాక్ రక్షణ శాఖ మంత్రి షాకింగ్ వ్యాఖ్య
Pak Defence Minister on Terrorism

ఇంటర్నెట్ డెస్క్: పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని భారత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. అనేక వేదికలపై దాయాది దేశం తీరును ఎండగడుతోంది. ఇవన్నీ అవాస్తవాలంటూ కొట్టి పారేస్తూ వచ్చిన పాక్ తొలిసారిగా తన బండారాన్ని బయటపెట్టుకుంది. అమెరికా కోసమే తాము ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని, అగ్రరాజ్యంతో పాటు పాశ్చాత్య దేశాల కోసమే ఈ పాడు పని చేస్తున్నామని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తాజాగా పేర్కొన్నారు. ఇటీవలి పహల్గామ్ దాడికి పాక్‌దే బాధ్యత అని భారత్ తేల్చి చెప్పిన నేపథ్యంలో పాక్ మంత్రి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.


ఉగ్రవాదానికి పాక్ మద్దతుపై ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఖ్వాజా ఆసిఫ్ ఈ కామెంట్స్ చేశారు. ‘‘అమెరికా, బ్రిటన్‌తో పాటు పాశ్చాత్య దేశాల కోసమే 30 ఏళ్లుగా ఈ పాడు పని చేస్తున్నాము’’ అని అన్నారు. అయితే, ఈ తిప్పిదం వల్ల తాము చాలా నష్టపోయామని చెప్పారు. ‘‘సోవియ్ యూనియన్‌కు వ్యతిరేకంగా యుద్ధంలో తాము భాగంగా కాకపోయి ఉంటే.. ఆ తరువాత 9/11 దాడులు.. ఇవన్నీ లేకపోయిన ఉంటే మా ట్రాక్ రికార్డుకు తిరుగే ఉండేది కాదు’’ అని చెప్పుకొచ్చారు. సోవియట్ యూనియన్‌తో ప్రచ్ఛన యుద్ధం రోజుల్లో పాక్ అమెరికాకు వత్తాసు పలికిన విషయం తెలిసిందే. 9/11 దాడుల తరువాత అమెరికా ఆఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకోవడానికి కూడా పాక్ మద్దతు పలికింది.


మరోవైపు, బ్రిటన్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ పహాల్గామ్ దాడిని ఖండించారు. ఉగ్రసంస్థల వెనకున్న పాక్ మద్దతును కూడా ఎండగట్టారు. ‘‘ఈ దాడికి కారణమైన లష్క రే తయ్యాబా ఓ పాకిస్థానీ సంస్థ. జమ్మూ కశ్మీర్‌లోని అమాయకులను ఈ సంస్థ టార్గెట్ చేస్తుంది. ఇది విచారకరమైన వాస్తవం. ఉగ్రవాదులకు పాక్ మద్దతు ఉందని అన్నారు.

ఇవి కూడా చదవండి..

చైనాపై సుంకాలు తగ్గుతాయ్‌

విద్యార్థి వీసాల రద్దుకు బ్రేకులు

Read Latest and International News

Updated Date - Apr 25 , 2025 | 01:16 PM