Pahalgam Terror Attack: దేశం వీడుతోన్న పాకిస్థానీయులు..
ABN, Publish Date - Apr 25 , 2025 | 12:34 PM
Pahalgam Terror Attack: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగా భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్థానీయులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అందుకు 48 గంటల గడువు సైతం విధించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: జమ్మూ కాశ్మీర్‌లో అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రదాడి కారణంగా 26 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై కేంద్రం సీరియస్ అయింది. అందులోభాగంగా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ క్రమంలో భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్థానీయులకు జారీ చేసిన వీసా గడువు ఏప్రిల్ 27వ తేదీతో ముగిస్తుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ లోపు వారంతా దేశం వీడి వెళ్లవలసి ఉంటుందని పేర్కొంది.
దీంతో భారత్‌లో పర్యటిస్తున్న అనేక మంది పాకిస్థాన్ జాతీయులు పంజాబ్‌లోని అటారీ వాఘా సరిహద్దు ద్వారా తమ దేశానికి తిరిగి ప్రయాణమయ్యారు. తమ బంధువులను కలుసుకునేందుకు తాము 45 రోజుల వీసా గడువుపై భారత్‌కు వచ్చామని వారు పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో అటారీ-వాఘా సరిహద్దును అధికారులు మూసివేసిన విషయం విధితమే. అలాగే న్యూఢిల్లీలోని పాకిస్థాన్ రాయబారీ కార్యాలయంలోని దౌత్యవేత్తతోపాటు మిగిలిన అధికారులు దేశం వీడి వెళ్లాలని ఆదేశించింది. అందుకోసం వారికి వారం రోజుల గడువు విధించింది.
ఏప్రిల్ 22వ తేదీ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ విషయంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్‌కు సింధు జలాలను నిలిపివేసింది. అలాగే అటారీ సరిహద్దును మూసి వేసింది. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకొంది.
Pahalgam terror attack: ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం
Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో మృతి చెందిన లెఫ్టినెంట్ భార్యపై కామెంట్లు.. నిందితుడు అరెస్ట్
For National News And Telugu News
Updated Date - Apr 25 , 2025 | 12:41 PM