ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pahalgam Attack: పహల్గామ్ దాడికి కారణం ఎవరో చెప్పిన మాజీ పాక్ ఆర్మీ మేజర్

ABN, Publish Date - May 28 , 2025 | 06:16 PM

Pahalgam Terror Attack: ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిల్ రజ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఆర్మీ ఎలా ఉగ్రవాదులకు సాయం చేస్తోంది.. పాకిస్తాన్‌లో ఉంటూనే వారి ద్వారా జమ్మూకాశ్మీర్‌లో ఎలా హింసకు పాల్పడుతోందో చెప్పారు.

Pahalgam Terror Attack

యావత్ భారతదేశాన్ని శోక సంద్రంలో ముంచేసిన పహల్గామ్ ఉగ్రదాడికి అసలు కారకుడు ఎవరో తెలిసిపోయింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పహల్గామ్ ఉగ్రదాడికి వ్యూహ రచన చేసినట్లు మాజీ పాకిస్తాన్ ఆర్మీ మేజర్ ఆదిల్ రజ వెల్లడించారు. ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిల్ రజ మాట్లాడుతూ.. ‘ పాకిస్తాన్ ప్రజల దృష్టి తన నుంచి మరల్చడానికి.. కుర్చీని కాపాడుకోవడానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్ పహల్గామ్ ఉగ్రదాడికి వ్యూహరచన చేశాడు.


పాకిస్తాన్ ఆర్మీకి చెందిన మరో ఐదుగురు ఉన్నత స్థాయి అధికారులు కూడా ఇందులో భాగం అయ్యారు’ అని అన్నారు. ఆ అధికారుల పేర్లను కూడా నేషనల్ మీడియాకు వెల్లడించారు. పాకిస్తాన్ ఆర్మీ ఎలా ఉగ్రవాదులకు సాయం చేస్తోంది.. పాకిస్తాన్‌లో ఉంటూనే ఉగ్రవాదుల ద్వారా జమ్మూకాశ్మీర్‌లో ఎలా హింసకు పాల్పడుతోందో చెప్పారు. ఆదిల్ రజ చెప్పిన విషయాలతో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్ ఎంతటి నీచుడో తెలిసిపోయింది. కుర్చీకోసం 26 మంది ప్రాణాలు బలితీసుకున్నాడు. ఇప్పటికీ భారత్‌పై కుట్రలు చేస్తూనే ఉన్నాడు.


ఆపరేషన్ సిందూర్ ఆరంభం మాత్రమే..

ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకాశ్మీర్, పహల్గామ్‌లోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ముస్లింలా కాదా తెలుసుకుని మరీ చంపేశారు. మొత్తం 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. వీరిలో ఇద్దరు తెలుగు వారు కూడా ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులకు, వారికి సాయం చేస్తున్న పాకిస్తాన్‌కు సరైన విధంగా బుద్ధి చెప్పడానికి భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదుల ఏరివేత మొదలెట్టింది. మే 7వ తేదీన పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై ఎయిర్‌ఫోర్స్ దాడులు చేసింది. దాదాపు 100 మందికిపైగా ఉగ్రవాదులు చనిపోయారు.


ఇవి కూడా చదవండి

ఆపరేషన్ సిందూర్.. ఈ రాష్ట్రాల్లో మాక్ డ్రిల్

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. వరి మద్దతు ధర పెంపు..

Updated Date - May 28 , 2025 | 07:17 PM