ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. పాకిస్తాన్‌కు వార్నింగ్..

ABN, Publish Date - May 12 , 2025 | 11:40 AM

Operation Sindoor: ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి కీలక సాక్ష్యాలను బయటపెట్టింది. దాడికి సంబంధించిన శాటిలైట్ ఫొటోలు విడుదల చేసింది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత ఆర్మీ రెండు భాగాలలో దాడులు చేసింది.

Operation Sindoor

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి భారత ఆర్మీ దాడులకు పాల్పడింది. దాదాపు 100 మంది ఉగ్ర కుక్కలను చంపేసింది. ఈ నేపథ్యంలోనే రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. తీవ్రంగా నష్టపోయిన పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. అయితే, కుక్క తోక వంకర అన్నట్లు పాక్ తన బుద్ధి మార్చుకోవటం లేదు. కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న రోజే పాక్ ఆర్మీ సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడింది.


ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో నిన్న ఇండియన్ ఏయిర్‌ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని ప్రకటించింది. ఇక, పాక్ కాల్పుల విరమణకు తూట్లు పొడవటంపై భారత్ తీవ్ర హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ రిపోర్టు ప్రకారం.. ‘ మే 10వ తేదీన పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది. అయినా కూడా డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులు చేసింది. ఒప్పందాన్ని అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వాళ్లకు తెలియాలి. ఆపరేషన్ సిందూర్ మిగియలేదు.. కొనసాగుతూనే ఉంటుంది.


ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు ఓ గట్టి సందేశం పంపాము. ఉగ్రవాదులకు గానీ, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వారికి గానీ పాకిస్తాన్‌లో సురక్షిత ప్రదేశం అంటూ ఏదీ లేదు. ఒక ప్రదేశంలో ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి.. మరో చోటు నుంచి దాడికి సిద్దం చేస్తారు. దాడి తర్వాత వెనక్కు వెళ్లిపోయి నాలుగు అంతస్తుల భవనంలో దాక్కుంటారు. మేము చాలా సురక్షితంగా ఉన్నాం అని వారు భావిస్తారు. మేము వాళ్ల కోస వస్తాం ’ అని విశ్వసనీయ వర్గాలు పాక్‌కు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. శాటిలైట్ ఫొటోలు విడుదల చేసిన ఆర్మీ..

Hero Vishal: విశాల్‌కు అస్వస్థత.. స్టేజిపై స్ప్రహతప్పిన హీరో

Updated Date - May 12 , 2025 | 11:47 AM