ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ex US Pilot Backs India: యుద్ధం వస్తే పాక్‌పై భారత్‌దే విజయం అంటున్న అమెరికా ఎయిర్‌ఫోర్స్ మాజీ పైలట్

ABN, Publish Date - May 08 , 2025 | 08:35 PM

యుద్ధం అంటూ వస్తే పాక్‌పై భారత్‌దే విజయం అంటూ అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ మాజీ పైలట్ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.

Dale Stark statement

ఇంటర్నెట్ డెస్క్: పాక్‌తో యుద్ధంలో భారత్‌దే విజయం అంటూ అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ మాజీ పైలట్ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. డేల్ స్టార్క్ అనే మాజీ పైలట్ గురువారం ఈ పోస్టు నెట్టింట పంచుకున్నారు. భారత్ గెలుపుపై తన మొత్తం డబ్బును పందెం కాసేందుకు సిద్ధమేనని అన్నారు. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన భారత్ పాక్‌లోని ఉగ్రస్థావరాలను కచ్చితమైన మిసైల్ దాడులతో ధ్వంసం చేసింది. అయినా బుద్ధి తెచ్చుకోని పాక్ ప్రస్తుతం సరిహద్దు వెంబడి కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితులు ముదిరితే ఎలా అన్న చర్చ మొదలైంది. ఈ విషయంపై డేల్ స్టార్క్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘భారత్, పాక్ పైలట్లు ఇద్దరితోనూ నేను గతంలో కలిసి పనిచేశా. ఈ పరిస్థితి ముదిరితే మాత్రం భారత్‌కే విజయం దక్కుతుందని నా అభిప్రాయం’’ అని పేర్కొన్నారు.


డేల్ కామెంట్స్‌కు పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పాక్ వద్ద అమెరికాకు చెందిన ఎఫ్-16, చైనాకు చెందిన జేఎఫ్-17 విమానాలు ఉంటే భారత్ వద్ద ఫ్రాన్స్‌కు చెందిన అత్యాధునిక రఫేల్ విమానాలు ఉన్నాయి. 4.5 తరం యుద్ధ విమానమైన రఫేల్‌.. భారత యుద్ధ విమానాల్లో అత్యాధునికమైనది. భారత ఉపఖండ పరిస్థితుల కోసం 13 ప్రత్యేక ఫీచర్లను కూడా రఫేల్‌కు జోడించారు. బియాండ్ విజువల్ రేంజ్ లక్ష్యాలను ధ్వంసం చేసే మెటియార్ మిసైల్స్, ఎల్ట్రానిక్ యుద్ధరీతులకు ఉద్దేశించిన సాధనాలు, గొప్ప సామర్థ్యం కలిగిన రాడార్, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఈ విమానంలో ఉన్నాయి. ఫలితంగా యుద్ధ సమయాల్లో అత్యంత సమర్థవంతంగా ఈ విమానాలు తమ లక్ష్యాలను ధ్వంసం చేయగలవు. ఇక హామర్ బాంబ్స్, స్కాల్క్ మిసైల్స్‌తో రఫేల్ యుద్ధ విమానాలు శత్రుదేశ మూలమూలాల ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయగలవు.


ఇక పాక్‌కు ఎఫ్-16లు విక్రయించేటప్పుడే అమెరికా ఎన్నో ఆంక్షలు విధించింది. భారత్‌పై ఈ విమానాలను వాడొద్దని స్పష్టం చేసింది. ఎఫ్-16ల వినియోగంపై వేయి కళ్లతో నిఘా పెట్టింది. ఆర్థిక కష్టాల్లో ఉన్న పాక్‌కు ఎఫ్-16ల నిర్వహణ కష్టంగా మారింది. దీంతో, ఎఫ్-16 అన్ని అవసరాలకు వినియోగించుకోలేని పరిస్థితుల్లో పాక్ ఇరుక్కుపోయింది. జేఎఫ్ -17 యుద్ధ విమానాలు ఉన్నప్పటికీ వీటి సామర్థ్యం రఫేల్‌తో పోలిస్తే పరిమితమేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఆయుధాలు మోసుకెళ్లే సామర్థ్యం, యుద్ధసమయాల్లో శత్రువుల దాడుల నుంచి తప్పించుకోవడం, సుదూరాన లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యంలో జేఎఫ్-17 రఫేల్‌తో పోలిస్తే వెనకబడే ఉంటోంది.

ఇవి కూడా చదవండి:

భారత్‌తో ఉద్రిక్తతలు.. పాక్‌ జాతీయులకు తాలిబాన్ వార్నింగ్

భారత్-పాక్ ఉద్రిక్తతల వెనక చైనా కుట్ర ఉంది.. అమెరికా వ్యాపారవేత్త కామెంట్ వైరల్

భారత్‌తో ఉద్రిక్తతలు.. మనం పాపులం అంటూ జాతీయ అసెంబ్లీలో పాక్ నేత కన్నీరు

Read Latest and National News

Updated Date - May 08 , 2025 | 08:43 PM