Naveen Patnaik: ఆసుపత్రిలో చేరిన నవీన్ పట్నాయక్
ABN, Publish Date - Aug 17 , 2025 | 08:02 PM
నవీన్ పట్నాయక్ ఆదివారం నాడు తనకు అసౌకర్యంగా ఉందని చెప్పడంతో వైద్యుల బృందం ఆయన ఇంటికి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించింది. అనంతరం ఆయనను మెడికేర్ ఆసుపత్రిలో చేర్చారు. 78 ఏళ్ల నవీన్ పట్నాయక్ సర్వికల్ ఆర్థరైటిస్‌కు ఇటీవల ముంబైలో స్పైనల్ సర్జరీ చేయించుకున్నారు.
భువనేశ్వర్: ఒడిశా (Odisha) మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) భువనేశ్వర్‌లోని ఎస్‌యూఎం అల్టిమేట్ మెడికేర్‌లో చేరారు. డీహైడ్రేషన్‌తో బాధపడుతుండటంతో ఆదివారం సాయంత్రం 5.15 గంటలకు ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. చికిత్సకు సహకరిస్తున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
నవీన్ పట్నాయక్ ఆదివారంనాడు తనకు అసౌకర్యంగా ఉందని చెప్పడంతో వైద్యుల బృందం ఆయన ఇంటికి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించింది. అనంతరం ఆయనను మెడికేర్ ఆసుపత్రిలో చేర్చారు. 78 ఏళ్ల నవీన్ పట్నాయక్ సర్వికల్ ఆర్థరైటిస్‌కు ఇటీవల ముంబైలో స్పైనల్ సర్జరీ చేయించుకున్నారు. జూలై 12న తిరిగి ఒడిశా చేరుకున్నారు. 21 రోజుల చికిత్స తర్వాత భువనేశ్వర్ చేరుకున్న ఆయనకు ఘనమైన స్వాగతం లభించింది. వందలాది మంది బీజేడీ మద్దతుదారులు జెండాలు ఊపుతూ 'జై జగన్నాథ్' అంటూ తమ నేతకు స్వాగతం పలికారు.
నవీన్ పట్నాయక్ ప్రస్తుతం ఒడిశా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయనకు చికిత్స సమయంలో బీజేడీ ఉపాధ్యక్షుడు దేబి ప్రసాద్ మిశ్రా సారథ్యంలోని 15 మంది సభ్యుల బీజేడీ కమిటీ పార్టీ వ్యవహారాలను చూసుకుంది.
ఇవి కూడా చదవండి..
రాహుల్‌కు ఈసీ అల్టిమేటం.. ఏడురోజులు గడువు
అంతా కృష్ణమయం... ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేను జాతికి అంకితం చేసిన ప్రధాని
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 17 , 2025 | 10:15 PM