ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nimisha Priya: మిలియన్ డాలర్ల బ్లడ్ మనీ ఆఫర్ చేసిన నిమిష ప్రియ కుటుంబం.. ఆమె ప్రాణాలు నిలిచేనా

ABN, Publish Date - Jul 12 , 2025 | 10:53 AM

యెమెన్‌లో మరణ శిక్ష పడ్డ నిమిష ప్రియను కాపాడుకునేందుకు ఆమె కుటుంబం 1 మిలియన్ డాలర్లను బ్లడ్ మనీ కింద ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ దిశగా యెమెన్ రాజధానిలో చర్చలు జరుగుతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Nimisha Priya

ఇంటర్నెట్ డెస్క్: యెమెన్‌లో భారతీయ నర్సు నిమిష ప్రియ మరణ శిక్షను మరో మూడు రోజుల్లో అమలు చేయనున్నారు. అక్కడి పౌరుడి హత్య కేసులో నిందితురాలిగా ఉన్న నిమిష ప్రియకు మృతుడి కుటుంబం బ్లడ్ మనీ తీసుకుని క్షమాభిక్ష ప్రసాదిస్తేనే ఆమె ప్రాణాలు నిలుస్తాయి. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబం ఒక మిలియన్ డాలర్లను బ్లడ్ మనీ కింద ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

సేవ్ నిమిష ప్రియ యాంక్షన్ కౌన్సిల్ సంస్థకు చెందిన ఓ కార్యకర్త ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. మృతుడి కుటుంబం క్షమాభిక్షే నిమిష ప్రియకు మిగిలున్న ఒకే ఒక మార్గమని అన్నారు. ఈ విషయంలో యెమెన్ రాజధాని సనా వేదికగా చర్చలు జరుగుతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

నిమిష ప్రియ కుటుంబం తరపున శామ్యుయెల్ జెరోమ్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అయితే, మృతుడి కుటుంబం ఈ విషయంలో ఇంకా ఎలాంటి సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. క్షమాభిక్షకు ఆ కుటుంబం అంగీకరిస్తే మిలియన్ డాలర్లు చెల్లించేందుకు నిమిష కుటుంబం ప్రతినిధి సంసిద్ధత వ్యక్తం చేశారట.

షరియా చట్టం ఆధారంగా యెమెన్‌ న్యాయవ్యవస్థ రూపుదిద్దుకుంది. హత్య కేసుల్లో బాధిత కుటుంబం బ్లడ్ మనీ కింద కొంత పరిహారాన్ని నిందితుల నుంచి స్వీకరించి క్షమాభిక్షను ప్రసాదిస్తే మరణ శిక్షను రద్దు చేయొచ్చు. శిక్ష అమలుకు చివరి నిమిషంలో కూడా ఈ క్షమాభిక్ష ఇచ్చేందుకు అక్కడి చట్టాలు అనుమతిస్తాయి.

ఇవి కూడా చదవండి:

గ్రామంలో రోడ్లు లేవంటూ సోషల్ మీడియాలో గర్భిణుల నిరసన.. ఎంపీ రెస్పాన్స్ చూస్తే..

ఒక్క రోజు కూడా పని చేయని కానిస్టేబుల్‌కు రూ.28 లక్షల జీతం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 12 , 2025 | 11:10 AM