Digital Arrest Scam: ముంబైలో 8 రోజులు డిజిటల్ అరెస్ట్‌లో డాక్టర్
ABN, Publish Date - Jun 29 , 2025 | 04:06 AM
డిజిటల్ అరెస్ట్ అనేదే ఉండదంటూ ఎంతగా ప్రచారం చేస్తున్నప్పటికీ అనేక మంది దీని బారిన పడుతూ కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు..
రూ.3 కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు
ముంబై, జూన్ 28: ‘డిజిటల్ అరెస్ట్’ అనేదే ఉండదంటూ ఎంతగా ప్రచారం చేస్తున్నప్పటికీ అనేక మంది దీని బారిన పడుతూ కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో బెదిరింపులకు గురి చేస్తూ దోచుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ముంబైలో వెలుగుచూసింది. 70 ఏళ్ల వయసున్న ఓ డాక్టర్‌ను సైబర్ నేరగాళ్లు ఏకంగా 8 రోజులు డిజిటల్ అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఆ డాక్టర్ నుంచి రూ.3 కోట్లు కొల్లగొట్టారు. బాధితురాలికి గత నెలలో అమిత్ కుమార్ అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. టెలికం ఆపరేటర్‌ను అని చెప్పి వివరాలను సేకరించాడు. తర్వాత పోలీసునని మరో వ్యక్తి ఫోన్ చేసి మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదైందని చెప్పి భయపెట్టాడు. ఆ తర్వాత ఆమెపై ఎనిమిది రోజుల పాటు వీడియో నిఘా పెట్టారు. ఈ క్రమంలో తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె.. నేరగాళ్లు ఇచ్చిన పలు బ్యాంకు ఖాతాలకు రూ.3 కోట్లు బదిలీ చేశారు.
Updated Date - Jun 29 , 2025 | 04:09 AM