ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ballari: స్వల్ప కాలంలోనే మరిన్ని కొత్త రైళ్లు

ABN, Publish Date - Jul 12 , 2025 | 01:46 PM

దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైల్వేలో విప్లవాత్మక మార్పులొచ్చాయనీ, తాను పదవీబాధ్యతలు స్వీకరించిన స్వల్పకాలంలోనే రాష్ట్రంతో సహా అనేక ప్రదేశాలలో మరిన్ని రైళ్లు మంజూరయ్యాయని కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న అన్నారు.

- కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న

బళ్లారి(బెంగళూరు): దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైల్వేలో విప్లవాత్మక మార్పులొచ్చాయనీ, తాను పదవీబాధ్యతలు స్వీకరించిన స్వల్పకాలంలోనే రాష్ట్రంతో సహా అనేక ప్రదేశాలలో మరిన్ని రైళ్లు మంజూరయ్యాయని కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న(Minister Somanna) అన్నారు. బళ్లారి రైల్వే స్టేషన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పది వందేభారత్‌ రైళ్లు నడుపుతోందన్నారు. మరిన్ని రైళ్లు నడుస్తున్నాయని, స్లీపర్‌ వందే భారత్‌ రైలు త్వరలో ప్రారంభిస్తామన్నారు.

యూపీఏ హయాంలో నిలిచిపోయిన అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. 3,300 అండర్‌పా్‌సలు, ఓవర్‌ పాస్‌లు మాత్రమే నిర్మించారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 6,600కిపైగా వంతెనలను నిర్మించినట్లు తెలిపారు. దీని కారణంగా చాలా రైల్వే సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. గురువారం చిక్కమగళూరు-తిరుపతి కొత్త రైలును ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14 కొత్త రైళ్లు నడుస్తున్నాయన్నారు. మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తరువాత కర్ణాటక కూడా అభివృద్ధి చెందుతుందన్నారు.

ఈ కారణంగా అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. లెవెల్‌ క్రాసింగ్‌ రైల్వే శాఖకు పెద్ద తలనొప్పిగా మారిందన్నారు. ప్రస్తుతం దానిని దశల వారీగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. చిక్కజాజూరు బళ్లారి రైల్వే డబ్లింగ్‌ పనులు చాలా రోజులుగా నిలిచిపోయాయన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.3300 కోట్లు మంజూరు చేసిందన్నారు. పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని అన్నారు.

అమృత్‌ స్టేషన్‌ ప్రాజెక్టు కింద అనేక చోట్ల రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ చేపడుతున్నామని తెలిపారు. దేశ ప్రతిరూపాన్ని మార్చడానికి మోదీ కర్ణాటకకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలన్నారు. పునరుజ్జీవనం బళ్లారి జిల్లా చుట్టూ 40 కిలోమీటర్లు ఎక్కడా రైల్వే క్రాసింగ్‌లు లేకుండా అన్ని చోట్లా ఎల్‌వోబీలు, ఆర్‌ఓబీలు నిర్మించాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

త్వరలోనే ఈ విషయంలో ఒక ఉత్తర్వు జారీచేసి సర్వే నిర్వహించాలని ఆదేశిస్తానన్నారు. నేను వచ్చినప్పటి నుంచి బళ్లారిలో అన్ని పనులకు ప్రాధాన్యం ఇచ్చానన్నారు. రైల్వే ఆధునికీకరణ పనులు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉన్నాయని తన దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి.

రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

తెలంగాణలో అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇదే..

Read Latest Telangana News and National News

Updated Date - Jul 12 , 2025 | 01:46 PM