ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Caste Census: కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం

ABN, Publish Date - Jun 04 , 2025 | 05:30 PM

దేశంలో కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కులగణనతోపాటు జనగణనను సైతం చేపట్టాలని నిర్ణయించింది. ఇవి రెండు దశల్లో చేపట్టాలని భావిస్తోంది.

PM Modi With Amith Shah

న్యూఢిల్లీ, జూన్ 04: దేశవ్యాప్తంగా కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2027, మార్చి 1వ తేదీ నుంచి ఈ కులగణన చేపట్టాలని కేంద్రం బుధవారం నిర్ణయించింది. అయితే ఈ కులగణనను రెండు దశలుగా చేయాలని భావిస్తోంది. దీనితోపాటు జనగణనను సైతం చేపట్టాలని చూస్తోంది. 2026, అక్టోబర్ 1వ తేదీ నుంచి తొలి దశ చేపట్టనుంది. ఈ దశలో జమ్మూ కాశ్మీర్‌, లడఖ్, ఉత్తరాఖండ్‌, హిమాచల్ ప్రదేశ్‌లలో చేపట్టనున్నారు. మంచు ప్రభావం ఉన్న ఈ ప్రాంతంలో తొలుత ఈ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. 2027, మార్చి 1 వ తేదీ నుంచి రెండో దశలో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక గెజిట్‌ను జూన్ 16వ తేదీన కేంద్రం విడుదల చేసే అవకాశం ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.


దేశంలో సామాజిక న్యాయం, సంక్షేమ విధనాలు, రాజకీయ ప్రాతినిధ్యం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొనేందుకు ఈ కుల గణన చేపట్టాలని వాదన చాలా కాలంగా దేశంలో బలంగా వినిపిస్తోంది. అయితే కులగణనపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు తొలుత ప్రస్తావించారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణల్లో సైతం ఈ కులగణన సర్వేను నిర్వహించారు. దీంతో కేంద్రంపై ఈ కులగణన సర్వే అంశం తీవ్ర ఒత్తిడి వచ్చింది. అయితే ఈ కులగణనపై మోదీ ప్రభుత్వం తొలుత నిరాకరించింది. కానీ ఈ కులగణన దేశవ్యాప్తంగా నిర్వహించాలంటూ అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో కులగణన చేపట్టేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీంతో జనగణన చేపట్టినప్పుడు కులగణన కూడా చేపట్టాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.


అసలు అయితే 2021లో జనగణన నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా విజృంభించడంతో.. ఆ సమయంలో ఈ జనగణన నిర్వహించలేదు. అయితే 2027లో జనగణనతోపాటు కులగణన సైతం నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. అదీకాక 2029లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నాటికే ఈ కులగణనతోపాటు జనగణన చేపట్టాలని చూస్తోంది. అలాగే నియోజకవర్గాల పునర్విభజన సైతం జరగనుంది. ఆ ముందే ఈ గణన చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

అమర్‌నాథ్ యాత్రకు ఉగ్ర ముప్పు.. కేంద్రం అలర్ట్

ఆపరేషన్ సిందూర్‌ను ప్రధాని మోదీ ఎలా ట్రాక్ చేశారో తెలుసా..

For National News And Telugu News

Updated Date - Jun 04 , 2025 | 05:55 PM