Rahul Gandhi: వర్తమానం ఊసెత్తకుండా 2047 గురించి కలలా? రాహుల్ ఘాటు విమర్శ
ABN, Publish Date - Jun 09 , 2025 | 05:44 PM
ఈరోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలను చూసేదెవరని రైలు ప్రమాద ఘటనను ఉద్దేశించి రాహుల్ అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనలో జవాబుదారీతనం లోపించిందని, కేవలం ప్రచారార్భాటమే కనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. వర్తమానం గురించి కేంద్రం మాట్లాడటం మానేసి 2047 గురించి కలలు కంటోందని విమర్శించారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ప్రయాణికులతో కిక్కిరిసిన లోకల్ ట్రైన్ నుంచి కిందపడి నలుగురు ప్రయాణికులు ఆదివారం మృతిచెందడం, ఆరుగురు గాయపడిన ఘటన అనంతరం రాహుల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఈ విమర్శలు గుప్పించారు.
మోదీ ప్రభుత్వం 11 ఏళ్లు సేవలను సెలబ్రేట్ చేసుకుంటుంటే.. ముంబై నుంచి వచ్చిన విషాద వార్త వాస్తవ పరిస్థితికి అద్దంపడుతోందని రాహుల్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. రైలు నుంచి పడి పలువురు ప్రాణాలు కోల్పోయారని, కోట్లాది మంది ప్రజలకు భారత రైల్వేలు వెన్నెముక వంటిదని, కానీ ఈరోజు ఆ సంస్థ అభద్రత, రద్దీ, గందరగోళానికి చిహ్నంగా మారిందని ఆరోపించారు.
రాహుల్ సంతాపం
ఈరోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలను చూసేదెవరని రైలు ప్రమాద ఘటనను ఉద్దేశించి రాహుల్ అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి
ఘోర ప్రమాదం.. రైలు నుంచి పడి ఐదుగురు మృతి
తొక్కిసలాట కేసు.. కర్ణాటక హైకోర్టుకు ఆర్‌సీబీ
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 09 , 2025 | 05:47 PM