Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్
ABN, Publish Date - Apr 21 , 2025 | 04:17 PM
Rs 500 Notes: కేంద్రం నోట్లు రద్దు చేసి.. కొత్త నోట్లను అమలులోకి తీసుకు వచ్చింది. అయితే వీటి చెలామణి జరుగుతోంది. అలాంటి వేళ.. కేంద్రం అప్రమత్తమైంది. ఆ క్రమంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కీలక సూచన చేసింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి చెందిన టెక్నాలజీని మానవాళి మంచికి వినియోగిస్తే మంచిదే. కానీ అదే దుర్వినియోగం అయితే మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవలసి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్‌లో నగదు వేసి.. ఇంటికి తిరిగి వచ్చేసరికి.. సైబర్ నేరగాళ్ల తమ మాయోపాయంతో వాటిని కొట్టేస్తున్నారు.
అలాంటి పరిస్థితుల్లో.. సరికొత్త టెక్నాలజీ వినియోగించి రూ.500 దొంగ నోట్లు చెలామణిలోకి వచ్చినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వీటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. ఈ దొంగ నోట్లు దాదాపుగా అసలు నోట్లను పోలి ఉన్నాయని వివరించింది. చాలా పరీక్షగా గమనిస్తేనే కానీ.. అసలు నోటుకు, నకిలీ నోటుకు తేడా తెలియని విధంగా ఉన్నాయని స్పష్టం చేసింది.
అయితే ఈ దొంగ నోట్లకు, అసలు నోట్లకు మధ్య తేడాను చిన్న స్పెల్లింగ్ ఉందని.. దీనిని ఇట్టే గుర్తించ వచ్చని ప్రజలను సూచించింది. దీనిని గుర్తించడంలో ఇదే కీలకమని పేర్కొంది.కరెన్సీ నోట్లపై సాధారణంగా RESERVE BANK OF INDIA అని ఉంటుందని.. కానీ దానిలో RESERVE అనే పదంలో Eకి బదులుగా A అని ఉంటుందని.. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు స్పష్టంగా పరిశీలించాలని ప్రజలకు సూచించింది.
ఇలాంటి నకిలీ నోట్లు అత్యంత ప్రమాదకరమని వెల్లడించింది. వీటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులు, సంస్థలు, ఏజెన్సీలను సూచించామని వివరించింది. ఈ విషయంలో ప్రజలు, వ్యాపార సంస్థలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచించింది. ఇక ఈ సమాచారాన్ని డీఆర్ఐ, సీబీఐతోపాటు ఎన్‌ఐఏతో సైతం పంచుకున్నట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి..
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ
For National News And Telugu News
Updated Date - Apr 21 , 2025 | 04:28 PM