Minister: మా శాఖలో నిధుల్లేవు... నాకు అధికారం లేదు..
ABN, Publish Date - Apr 22 , 2025 | 12:49 PM
మా శాఖలో నిధుల్లేవు... నాకు అధికారం లేదు.. అంటూ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే.. ఆయన చేసిన వ్యాఖ్యలతో పలువురు తీవ్రంగా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓ మంత్రి ఇలా మాట్లాడడం ఏంటి.. అంటూ చర్చించుకుంటున్నారు.
- అసెంబ్లీలో వాపోయిన మంత్రి పీటీఆర్
చెన్నై: తన శాఖలో నిధులు లేవని, తనకు అధికారమూ లేదంటూ రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖా మంత్రి పీటీఆర్ పళనివేల్ త్యాగరాజన్(Minister PTR Palanivel Thyagarajan) అసెంబ్లీలో వాపోవడం చర్చనీయాంశమైంది. గుడ్‌ఫ్రైడే, ఈస్టర్ పండుగ సెలవుల అనంతరం సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు పునః ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో గూడలూరు ప్రాంతంలో టైడల్‌పార్కు ఏర్పాటుచేయాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యే జయశీలన్ కోరారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: నిండు అసెంబ్లీలో.. సీఎం, మాజీసీఎంల మధ్య వాగ్వాదం
ఇందుకు సమాధానం చెప్పిన మంత్రి పళనివేల్ త్యాగరాజన్, తన ఇలాకాలో తిష్టవేసిన సమస్యలను ఇప్పటికే గత మూడేళ్ళు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించానని, తన శాఖకు మాత్రం అతితక్కువ నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. టైడల్ పార్కు, నియోటైడల్ పార్కుతో పాటు ప్రధాన పరిశ్రమలన్నీ పరిశ్రమల శాఖ ఆధీనంలో ఉన్నాయని చెప్పారు. ఎవరివద్ద పుష్కలంగా నిధులు, ప్రతిభ,
అధికారం వుందో వారిని ఆశ్రయిస్తే తమ శాఖకు లబ్ధిచేకూరుతుందని భావిస్తున్నానని, అయితే తన వద్ద ఈ మూడూ లేవని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న సభాపతి అప్పావు, ‘శాఖకు సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరింపజేసుకోండి, సభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు నిజాయితీగా, పారదర్శకంగా సమాధానం చెప్పడమే మంచి సంస్కారం’ అని సున్నితంగా మందలించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Price Record: బంగారం లకారం
గూగుల్ కీలక నిర్ణయం..ఆ కేసు పరిష్కారం కోసం రూ.20.24 కోట్లు చెల్లింపు
కేటీఆర్‌పై కేసులు కొట్టివేసిన హైకోర్టు
ACB: ఏసీబీ వలలో ఐదుగురు అధికారులు
Read Latest Telangana News and National News
Updated Date - Apr 22 , 2025 | 12:49 PM