ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Meghalaya Honeymoon Murder: మేఘాలయ హనీమూన్ మర్డర్‌లో మరో కోణం

ABN, Publish Date - Jun 15 , 2025 | 05:23 PM

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో మరో కొత్త అంశం బయటపడింది. పెళ్లయిన తొమ్మిది రోజులకే భర్తని హనీమూన్ పేరుతో మేఘాలయ తీసుకెళ్లి ప్లాన్ ప్రకారం హత్య చేయించిన నవ వధువు సోనమ్.. ఆమె ప్రియుడుగా భావిస్తున్న రాజ్ కుష్వాహ కలిసి దిగిన..

Meghalaya Honeymoon Murder

ఇంటర్నెట్ డెస్క్: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో మరో కొత్త అంశం బయటపడింది. పెళ్లయిన తొమ్మిది రోజులకే భర్తని హనీమూన్ పేరుతో మేఘాలయ తీసుకెళ్లి ప్లాన్ ప్రకారం హత్య చేయించిన నవ వధువు సోనమ్, ఆమె ప్రియుడుగా భావిస్తున్న రాజ్ కుష్వాహ కలిసి దిగిన ఫొటో ఒకటి బయటపడింది. వీరిద్ధరూ ఎంతో హ్యాపీగా ఆ ఫొటోకి ఫోజులిచ్చారు. రాజా రఘువంశీ హత్య కేసు దర్యాప్తులో తాజాగా బయటపడ్డ ఈ కొత్త ఫొటో ఇండోర్‌లోని విజయ్ నగర్ ప్రాంతంలో తీశారని పోలీసులు తేల్చారు. మృతుడు రాజా రఘువంశీ అన్నయ్య సచిన్ రఘువంశీ ఈ ఫొటోపై స్పందించారు. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ.. వాళ్ల అన్ని ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు.

ఇలా ఉండగా, రాజా రఘువంశీ మర్డర్‌ని ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేసిన నిందితులంతా ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ హత్య కేసులో భాగమైన సోనమ్, రాజ్ కుష్వాహ, మరో ముగ్గురి రిమాండ్ వచ్చే బుధవారం ముగియనుంది. దీంతో పోలీసులు కోర్టు నుంచి అదనంగా మరో 3 రోజుల రిమాండ్ కోరవచ్చని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రాజాని అన్యాయంగా పొట్టనబెట్టుకున్న వీళ్లు, ఎవరో ఒక స్త్రీని హత్య చేసి శరీరాన్ని పూర్తిగా కాల్చి, ఆ డెడ్ బాడీ రాజా భార్య సోనమ్‌‌దిగా చూపించడానికి ప్లాన్ చేశారని మేఘాలయ పోలీసులు వెల్లడించారు. సోనమ్‌ కోసం తీవ్రమైన సెర్చ్ ఆపరేషన్ జరుగుతుండటంతో ఈ మర్డర్ ప్లాన్ చేశారు. అయితే, అదృష్టవశాత్తూ మరో అమాయకపు ప్రాణం బలి కాకుండా పోలీసులకు సోనమ్ చిక్కింది.

ఇవి కూడా చదవండి

ట్రంప్ బర్త్‌డే రోజు పుతిన్ ఫోన్.. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం గురించి చర్చలు

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. రంగంలోకి యూకే

Updated Date - Jun 16 , 2025 | 01:45 PM