Iran And Israel War: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. రంగంలోకి యూకే
ABN , Publish Date - Jun 15 , 2025 | 01:10 PM
British Prime Minister Keir Starmer: ఇరాన్ బెదిరింపులను బ్రిటన్ లెక్కచేయలేదు. ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచేందుకు రంగంలోకి దిగింది. మిలటరీ బలగాలను మిడిల్ ఈస్ట్‌కు తరలిస్తున్నట్లు యూకే ప్రకటించింది.
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ ఒంటరి పోరాటం చేస్తోంది. అగ్రదేశాలు మొత్తం ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇజ్రాయెల్‌కు తన మద్దతు ప్రకటించారు. ఇరాన్‌కు హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సైనిక స్థావరాలు, వారి యుద్ధనౌకలను లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేసింది.
ఇరాన్ బెదిరింపులను బ్రిటన్ లెక్కచేయలేదు. ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచేందుకు రంగంలోకి దిగింది. మిలటరీ బలగాలను మిడిల్ ఈస్ట్‌కు తరలిస్తున్నట్లు యూకే ప్రకటించింది. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘నేను యూకేకు ఏది మంచిదో అదే చేస్తాను. మిడిల్ ఈస్ట్‌కు మిలటరీ బలగాలను తరలిస్తున్నాము. ఏదైనా అత్యవసర పరిస్థితి రావచ్చొని ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని అన్నారు.
యుద్ధంపై ట్రంప్, పుతిన్ చర్చ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుట్టిన రోజు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ ఫోన్ చేశారు. దాదాపు గంటకు పైగా ఇద్దరి మధ్యా సంభాషణలు నడిచాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం గురించి కూడా మాట్లాడుకున్నారు. యుద్ధం ఆపడానికి ఇద్దరూ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘నేను అనుకుంటున్నట్లే ఆయన కూడా అనుకుంటున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ఆగాలని కోరుకుంటున్నారు’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
ట్రంప్ బర్త్‌డే రోజు పుతిన్ ఫోన్.. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం గురించి చర్చలు