ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Meerut Blue Drum Case: బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

ABN, Publish Date - May 13 , 2025 | 10:08 AM

Meerut Blue Drum Case: ముస్కాన్, సాహిల్‌లు సౌరభ్‌ను హత్య చేశారు. డెడ్ బాడీని ముక్కలు చేసి డ్రమ్ములో సిమెంట్‌తో కప్పేశారు. బాడీని డ్రమ్ములో కప్పెట్టడానికి ముందు వేరే ప్లాన్ వేశారు. సూట్ కేసులో శవాన్ని కుక్కి.. దూరంగా ఎక్కడైనా పడేద్దామని అనుకున్నారు.

Meerut Blue Drum Case

మీరట్‌కు చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ మర్డర్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. భార్య, ఆమె ప్రియుడు కలిసి సౌరభ్‌ను చంపేశారు. ముక్కలుగా కోసి, డ్రమ్‌లో వేసి సిమెంట్‌తో కప్పేశారు. ఈ మర్డర్ కేసు బ్లూ డ్రమ్ మర్డర్ కేసుగా చాలా పాపులర్ అయింది. ఈ కేసుకు సంబంధించి తాజా అప్‌డేట్ వచ్చింది. పోలీసులు సౌరభ్ మర్డర్‌ కేసుకు సంబంధించి 1000 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. పోలీసుల ఛార్జ్‌షీటులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు 2023 నవంబర్ నుంచే మర్డర్ ప్లాన్‌లో ఉన్నట్లు తేలింది.


తమ ప్రేమకు సౌరభ్ అడ్డుగా ఉన్నాడని భావించిన ముస్కాన్, సాహిల్‌లు అతడ్ని చంపడానికి సంవత్సరం నుంచి ప్లాన్ వేస్తూ వచ్చారు. అయితే, ఉద్యోగం నిమిత్తం అతడు విదేశాలకు వెళ్లి పోవటంతో ప్లాన్ వర్కవుట్ అవ్వలేదు. 2025 ఫిబ్రవరి నెలలో అతడు కూతురి పుట్టిన రోజు కోసం ఇండియా వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ముస్కాన్, సాహిల్‌లు సౌరభ్‌ను హత్య చేశారు. డెడ్ బాడీని ముక్కలు చేసి డ్రమ్ములో సిమెంట్‌తో కప్పేశారు. బాడీని డ్రమ్ములో కప్పెట్టడానికి ముందు వేరే ప్లాన్ వేశారు. సూట్ కేసులో శవాన్ని కుక్కి.. దూరంగా ఎక్కడైనా పడేద్దామని అనుకున్నారు.


అది వర్కువుట్ అవ్వకపోవటంతో డ్రమ్ములో కప్పేశారు. సౌరభ్, ముస్కాన్‌ల ఆరేళ్ల కూతురు ‘ మా నాన్న డ్రమ్ములో ఉన్నాడు’ అంటూ పొరిగింటి వాళ్లకు చెబుతూ ఉండేది. వాళ్లు పాప మాటలు పట్టించుకోలేదు. భర్తను చంపిన తర్వాత ముస్కాన్ తన ప్రియుడితో కలిసి హిమాచల్ ప్రదేశ్ ట్రిప్‌కు వెళ్లింది. అక్కడినుంచి ఇంటికి తిరిగి వచ్చే సరికి అసలు విషయం బయటపడింది. భర్తను హత్య చేసినట్లు ఆమె ఒప్పుకుంది. ముస్కాన్, సాహిల్‌లు అరెస్ట్ అయ్యారు. ఈ ఇద్దరూ డ్రగ్స్‌కు బానిస అయినట్లు.. డ్రగ్స్ కోసం ఎంతటి దారుణానికైనా తెగిస్తారని పోలీసుల విచారణలో తేలింది.


ఇవి కూడా చదవండి

Viral Video: కామాంధుడికి చుక్కలు చూపించిన మహిళ.. నడిరోడ్డులో చెప్పుతో..

Ceasefire Agreement: ఒప్పందం జరిగినా మారని పాక్ బుద్ధి.. వరుసగా 3వ రోజు దాడులు

Updated Date - May 13 , 2025 | 10:10 AM