ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: తిరువణ్ణామలైలో మాంసాహార భోజనం..

ABN, Publish Date - Jun 11 , 2025 | 11:41 AM

ప్రముఖ శైవక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో దంపతులు మాంసాహారం తినడంపై ఆందోళనకు గురైన ఆలయ అధికారులు ప్రక్షాళన పూజలు చేయించారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులను తనిఖీ చేసిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తుంటారు.

- పరిహార పూజలు

చెన్నై: ప్రముఖ శైవక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయం(Tiruvannamalai Arunachaleshwaralayam)లో దంపతులు మాంసాహారం తినడంపై ఆందోళనకు గురైన ఆలయ అధికారులు ప్రక్షాళన పూజలు చేయించారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులను తనిఖీ చేసిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తుంటారు. ఈ నేపథ్యంలో, రాజగోపురం సమీపంలోని ఐదో ప్రాకారంలో సోమవారం ఓ జంట ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా మాంసాహార ఆరగిస్తుండగా, అటువైపు వెళ్లిన భక్తులు దీనిపై ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు.

తక్షణ చర్యలు చేపట్టిన అధికారులు ఆ దంపతులను పోలీసులకు అప్పగించారు. విచారణ అనంతరం ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడరాదని ఆ దంపతులను పోలీసులు హెచ్చరించి పంపించారు. ఈ నేఫథ్యంలో, మంగళవారం తెల్లవారుజామున ఆలయ ప్రాంగణంలో శివాచార్యులు పరిహార పూజలు నిర్వహించారు. దంపతులు మాంసాహారం తిన్న ప్రాంతం సహా ఆలయ ప్రాంగణం అంతా పవిత్ర జలాలను సంప్రోక్షించారు.

ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్

రాజీవ్‌ యువ వికాసం మరింత జాప్యం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 11 , 2025 | 11:41 AM