ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Marina Beach: మెరీనా తీరం... మైమరిపించే ప్రాంతం

ABN, Publish Date - Jun 25 , 2025 | 12:25 PM

స్థానిక మెరీనా బీచ్‌లో ‘బ్లూ ఫ్లాగ్‌’ సర్టిఫికెట్‌ పొందేలా గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) ఆధ్వర్యంలో పలు పనులు చేపట్టారు. ఆ ప్రకారం, బీచ్‌ ప్రాంతంలో కొబ్బరి ఆకుల పాకలు, పిల్లలకు క్రీడా మైదానం, క్రీడా ఉపకరణాలు ఏర్పాటవుతున్నాయి. డానిష్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ ప్రపంచంలోని అత్యుత్తమ బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ అందజేస్తోంది.

- బీచ్‌లో రూపుదిద్దుకుంటున్న సరికొత్త అందాలు

చెన్నై: స్థానిక మెరీనా బీచ్‌(Marina Beach)లో ‘బ్లూ ఫ్లాగ్‌’ సర్టిఫికెట్‌ పొందేలా గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) ఆధ్వర్యంలో పలు పనులు చేపట్టారు. ఆ ప్రకారం, బీచ్‌ ప్రాంతంలో కొబ్బరి ఆకుల పాకలు, పిల్లలకు క్రీడా మైదానం, క్రీడా ఉపకరణాలు ఏర్పాటవుతున్నాయి. డానిష్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ ప్రపంచంలోని అత్యుత్తమ బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ అందజేస్తోంది. ఘనవ్యర్ధాల నిర్వాహణ, బీచ్‌ శుభ్రత, పర్యాటకుల భద్రత, కల్పిస్తున్న వసతులు సహా వివిధ అంశాలు పరిశీలించి ఈ సర్టిఫికెట్‌ అందజేస్తోంది.

బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ అంతర్జాతీయ ప్రామాణికం కావడంతో, ఈ సర్టిఫికెట్‌ పొందిన బీచ్‌ ప్రాంతం అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతుంది. అలాగే, పర్యాటకుల రాకపోకలు పెరిగే కొద్దీ స్థానిక ఆర్ధిక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో కోవలం బీచ్‌ ఇప్పటికే బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ పొందింది. ఈ నేపథ్యంలో, చెన్నై మెరీనా బీచ్‌(Chennai Marina Beach), తిరువాన్మియూర్‌ సహా ఆరు బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ పొందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా, మెరీనా బీచ్‌లో మౌలిక సదుపాయాల పనులు వేగవంతమయ్యాయి.

ఇందుకోసం జీసీసీ ఆధ్వర్యంలో రూ.5.60 కోట్లతో బీచ్‌లో వాక్‌ వే, సైకిల్‌ మార్గాలు, ఆట స్థలం, వాచ్‌ టవర్‌, 360 డిగ్రీల నిఘా కెమెరాలు, ఓపెన్‌ ఎయిర్‌ జిమ్‌ నిర్మాణాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం బీచ్‌లో పిల్లల ఆట సామగ్రి ఏర్పాటుచేయడంతో పాటు మొక్కలు కూడా నాటుతున్నారు. అలాగే, పర్యావరణ అనుకూల వెదురుతో తయారుచేసిన షేడ్‌ రూఫ్‌లు, లాంజ్‌ కుర్చీలు, డస్ట్‌బిన్‌లు, సోఫాలు ఏర్పాటుచేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ కింద, దివ్యాంగుల కోసం 4 వీల్‌ చెర్లను కొనుగోలు చేశారు. సర్వీస్‌ రోడ్డులో వృద్ధులు, దివ్యాంగులు వెళ్లేలా బ్యాటరీ వాహనాలు కూడా ఏర్పాటయ్యాయి.

ఈ వార్తలు కూడా చదవండి.

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

జూలై ఒకటి నుంచి రైల్వే చార్జీలు స్వల్పంగా పెంపు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 25 , 2025 | 12:25 PM