త్రిభాషా విధానంపై మహా సర్కారు వెనుకడుగు
ABN, Publish Date - Jun 30 , 2025 | 04:55 AM
మరాఠా, ఇంగ్లీష్ మాధ్యమ ప్రాథమిక పాఠశాలల్లో ‘డీఫాల్ట్’గా హిందీ భాష నేర్చుకోవాలన్న నిర్ణయంపై నిరసన వెల్లువెత్తడంతో మహారాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది...
ముంబై, జూన్ 29: మరాఠా, ఇంగ్లీష్ మాధ్యమ ప్రాథమిక పాఠశాలల్లో ‘డీఫాల్ట్’గా హిందీ భాష నేర్చుకోవాలన్న నిర్ణయంపై నిరసన వెల్లువెత్తడంతో మహారాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది. ఈ విషయమై సవరిస్తూ గత ఏప్రిల్‌లో జారీ చేసిన త్రిభాషా విధానాన్ని ఉపసంహరిస్తున్నట్లు ఆదివారం తెలిపింది. తాజాగా విధాన రూపకల్పనకు డాక్టర్ నరేంద్ర జాదవ్ సారధ్యంలో కమిటీని ఏర్పాటు చేయాలని సీఎంఫడణవీస్ అధ్యక్షతన జరిగిన మహారాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ కమిటీ అన్ని వర్గాల వారితో సంప్రదిస్తుందని పేర్కొన్న ఫడణవీస్.. తమకు ‘మరాఠీ’ ముఖ్యమని తెలిపారు.
Also Read:
యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..
నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...
For More Telugu News
Updated Date - Jun 30 , 2025 | 04:55 AM