ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Madras High Court Slams: సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారా

ABN, Publish Date - Aug 09 , 2025 | 05:21 AM

సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారా అంటూ తమిళనాడు ఐఏఎస్‌ అధికారులపై మద్రాస్‌ హైకోర్టు

  • ఇది దురదృష్టకరం.. ప్రమాదకరం కూడా

  • ఐఏఎ్‌సలపై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం

చెన్నై, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ‘‘సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారా?.’’ అంటూ తమిళనాడు ఐఏఎస్‌ అధికారులపై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార దర్పంతో వ్యవహరిస్తున్నారని, ఇది దురదృష్టకరం, ప్రమాదకరమని వ్యాఖ్యానిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మాజీ ఐపీఎస్‌ అధికారికి ఇల్లు కేటాయించే విషయంలో ఐఏఎస్‌ అధికారులు వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. తమిళ సాహితీవేత్తలకు ‘డ్రీమ్‌ హౌస్‌ ప్రాజెక్టు’(కన్నావు ఇల్లం) కింద ఇళ్లను కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ తమిళ సినీ గేయ రచయిత వైరముత్తు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేశ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తమిళనాడు తొలి మహిళా ఐపీఎస్‌ అధికారిణి(రిటైర్డ్‌), రచయిత్రి తిలకవతికి ఇల్లు కేటాయించాలని గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై ఆమె మరోసారి అప్పీలు చేశారని గుర్తు చేసింది. ఇదేకాకుండా రచయితలకు ఇళ్ల కేటాయింపు ఉత్తర్వులను ఉపసంహరించుకోవడంపైనా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘రచయితలకు ఇళ్ల కేటాయింపు ఒక భావోద్వేగ అంశం. దీనిని ఐఏఎస్‌ అధికారులు స్పష్టంగా అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నా రు.’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు సమాంతర ప్రభుత్వంలా వ్యవహరించడం దురదృష్టకరమని, దీనిని కొనసాగిస్తే తీవ్ర సంక్షోభం తలెత్తుతుందని పేర్కొంది. రచయితకు కేటాయించిన ఇంటిని రద్దు చేయడమనేది మాజీ సీఎం దివంగత కరుణాధి హయాంలో జరిగి ఉంటే ఆయన చాలా బాధపడి ఉండేవారని, ఇలాంటి చర్యలను ఏ మాత్రం సహించేవారు కాదని వ్యాఖ్యానించింది.

Updated Date - Aug 09 , 2025 | 05:21 AM